TDP – JanaSena : ఇవాళ్టి నుంచి టీడీపీ – జనసేన ఉమ్మడి ఆత్మీయ సమావేశం..

ఏపీలో ఎన్నికలకు (AP Elections) మరో 5 సమయం ఉన్నా ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు టీడీపీ - జనసేన. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు (AP Skill Case) లో అరెస్ట్ అయినప్పటి నుంచి రాష్ట్ర టీడీపీ-జనసేన లో చాలా మార్పులు జరుగుతున్నాయి.

ఏపీలో ఎన్నికలకు (AP Elections) మరో 5 సమయం ఉన్నా ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు టీడీపీ – జనసేన. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు (AP Skill Case) లో అరెస్ట్ అయినప్పటి నుంచి రాష్ట్ర టీడీపీ-జనసేన లో చాలా మార్పులు జరుగుతున్నాయి. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ములాఖత్ నిర్వహించడం అనంతరం మీడియాతో 2024 ఎన్నికల్లో జనసేన – టీడీపీ కలిసి పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించడం ఇలా చాలా అంశాలు తెరపైకి వచ్చాయి. నిన్న టీడీపీ (TDP) – జనసేన (Janasena) ఉమ్మడి మేనిఫెస్టో భేటీలో పాల్గొన్నాయి. తాజాగా ఇరు పార్టీలు కలిసి ఉమ్మడిగా.. సమావేశాలు జరపాలని నిర్ణయించాయి. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ – జనసేన పార్టీలు నియోజకవర్గ స్థాయి నుంచి ఆత్మీయ సమావేశాలు నిర్వహించున్నారు. 14, 15, 16 తేదీల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయ తీసుకున్నారు. ఇక ఈ నెల 17వ తేదీ నుంచి చేపట్టే ఇంటింటి ప్రచారం పై సమీక్ష చేపట్టనున్నారు ఇరు పార్టీల నేతలు.

Hyderabad Sadar celebrations : హైదరాబాద్ లో సదర్ ఉత్సవాలు.. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

నేటి నుంచి జనసేన ఈ నెల 17వ తేదీ వరకు జనసేన నేతలు వరుస ప్రెస్ మీట్లు నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో వివిధ అంశాల్లో కుంభకోణాలు జరిగాయంటూ వరుస ప్రెస్ మీట్లు పెట్టబోతున్నారు. ముఖ్యంగా ఐబీ ఒప్పందాలు, టోఫెల్ , జగనన్న పాల వెల్లువలో అవినీతి జరిగిందంటూ ఇప్పటికే జనసేన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

S.SURESH