Chandrababu Naidu : చంద్రబాబుని KTR, KCR కలుస్తారా.. ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది. అయితే చంద్రబాబు అరెస్టు అయినప్పుడు కేటీఆర్ చేసిన కామెంట్స్ సీమాంధ్రుల్లో కొందరికి కోపం తెప్పించాయి.ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు NTR ని మెచ్చుకుంటూ టీడీపీ అనుకూల ప్రకటన చేయాల్సి వచ్చింది. కేటీఆర్ కూడా టీవీ చానల్స్ చర్చల్లో తన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. కానీ తెలంగాణలో టీడీపీ కేడర్, ఆంధ్ర వాళ్ళు.. మరీ ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం.. BRSకు వ్యతిరేకంగా ఓటు వేయాలని డిసైడ్ అయ్యారు.

సీమాంధ్ర ఓట్ల కోసం తప్పదు మరి.. !

నాలుగు వారాల బెయిల్ పై విడుదలైన టీడీపీ జాతీయ అధ్యక్షుడు ( Chandrababu ) చంద్రబాబు నాయుడు ప్రస్తుతం హైదరాబాద్ లో హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన బాబు.. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి జూబ్లీహిల్స్ లో ఇంటికి చేరుకోడానికి చాలా టైమ్ పట్టింది. వేల మంది అభిమానులు, కార్యకర్తలు ఆయన వెహికిల్ ను ఫాలో అయ్యి భారీ ర్యాలీతో ఇంటికి తీసుకొచ్చారు. ( Telangana elections ) తెలంగాణలో ఎలక్షన్ కోడ్ ఉండటంతో ఈ ర్యాలీ పై కేసు కూడా నమోదైంది.

ఇక తెలంగాణలో టీడీపీ సంగతి..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది. అయితే చంద్రబాబు అరెస్టు అయినప్పుడు కేటీఆర్ చేసిన కామెంట్స్ సీమాంధ్రుల్లో కొందరికి కోపం తెప్పించాయి.ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు NTR ని మెచ్చుకుంటూ టీడీపీ అనుకూల ప్రకటన చేయాల్సి వచ్చింది. కేటీఆర్ కూడా టీవీ చానల్స్ చర్చల్లో తన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. కానీ తెలంగాణలో టీడీపీ కేడర్, ఆంధ్ర వాళ్ళు.. మరీ ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం.. BRSకు వ్యతిరేకంగా ఓటు వేయాలని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ కి ఓటు వేయాలని కమ్మ సామాజిక వర్గం, టిడిపి అంతర్గత సమావేశాల్లో ఇప్పటికే నిర్ణయించారు. దీని ప్రభావం తెలంగాణలోని సీమాంధ్రలుతో పాటు… ఇంకా మరికొన్ని కులాలపైనా ఉండొచ్చు.

తెలంగాణ సీమాంధ్ర లంతా.. BRSకు వ్యతిరేకంగా మారుతున్నారు టాక్ బాగా వినిపిస్తోంది. దీంతో ఈ ప్రమాదాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని BRS అధిష్టానం డిసైడ్ అయింది. 52 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉండి వచ్చిన చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది.. అనే వంకతో KCR స్వయంగా వెళ్లి పరామర్శిస్తే ఎలా ఉంటుంది.. స్వామి కార్యం.. స్వాకర్యం రెండు నెరవేరుతాయి కదా.. అనే చర్చ BRSలో నడుస్తోంది.
నిజానికి 2014, 2018 ఎన్నికల్లో తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు చాలా వరకు TRSకే ఓట్లేశారు. కానీ ఇప్పుడు సమీకరణాలు మారాయి. అంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అందుకే డామేజ్ కంట్రోల్ కోసం KCR లేదా KTR రంగంలోకి దిగొచ్చని.. చంద్రబాబుని పరామర్శించడం ద్వారా.. తాము సీమాంధ్రులకు వ్యతిరేకం కాదన్నది జనంలోకి తీసుకెళ్ళవచ్చని పార్టీలో కొందరు భావిస్తున్నారు. అది జరక్కపోతే.. కనీసం పాతిక నియోజకవర్గాల్లో వీళ్ళ ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈ ప్రతిపాదనని BRSలో వ్యతిరేకించే వారు కూడా లేకపోలేదు. తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం మొత్తం మూడు శాతానికి మించి లేరు. ఆంధ్ర వాళ్ళు అంటే కేవలం కమ్మ వాళ్ళు మాత్రమే కాదు. మిగిలిన కులాలు ఉన్నాయి. వాళ్ళు అభివృద్ధిని చూస్తారే తప్ప.. చంద్రబాబు వ్యవహారాన్ని పట్టించుకోరనీ.. అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని ఈ వర్గం చెబుతోంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రోజు రోజుకీ BRSకి ఇబ్బందిగా మారుతోంది. సో.. ఈ పరిస్థితుల్లో అహానికి పోతే ఎక్కడో ఒక చోట దెబ్బ పడే ప్రమాదం ఉంది. అందుకే ఓ మెట్టు దిగ.. చంద్రబాబుని పరామర్శించి వస్తే.. తెలంగాణ సీమాంధ్ర వాళ్ళలో మార్పు రావొచ్చని మరికొందరి ఆశ. అదే నిజమైతే నాలుగైదు రోజుల్లో చంద్రబాబు ఇంట్లో KCR లేదంటే KTR ని చూసే అవకాశం ఉంది.