Geethanjali: టీడీపీ 5 ప్రశ్నలు.. తెనాలి స్టేషన్‌లో ఆమెతో ఉన్నది ఎవరు.. గీతాంజలి ఘటనపై అనుమానాలు..

7వ తేదీన గీతాంజలి రైలు కింద గాయాలతో చనిపోయింది. టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా టీమ్‌ చేసిన ట్రోలింగ్ వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని వైసీపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తుండగా.. దానికి సైకిల్ పార్టీ కూడా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తోంది.

  • Written By:
  • Publish Date - March 12, 2024 / 06:10 PM IST

Geethanjali: ఎన్నికల వేళ.. ఏపీ రాజకీయం కీలక టర్న్ తీసుకుంది. ఉన్నట్లుండి పాలిటిక్స్ అంతా.. గీతాంజలి అనే సాధారణ మహిళ చుట్టూ తిరుగుతున్నాయ్. పక్కా ఇంటితో పాటు అమ్మఒడి డబ్బులు వచ్చాయని.. వైసీపీ సర్కార్‌ ద్వారా తాము లబ్ధి పొందామని చెప్తూ ఓ చానెల్‌తో గీతాంజలి మాట్లాడారు. ఐతే దీనిపై రకరకాల ట్రోల్స్ పేలాయ్‌. ఇది వైసీపీ పెయిడ్‌ ప్రమోషన్ అంటూ కొన్ని గ్రూప్స్ ఆరోపణలు గుప్పించాయ్.

JaiBheem Bharath Party: జగన్ వ్యతిరేకులంతా ఆ పార్టీలోకి.. దీని వెనక బాబు స్కెచ్ ఉందా..?

7వ తేదీన గీతాంజలి రైలు కింద గాయాలతో చనిపోయింది. టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా టీమ్‌ చేసిన ట్రోలింగ్ వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని వైసీపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తుండగా.. దానికి సైకిల్ పార్టీ కూడా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తోంది. 7వ తేదీన గీతాంజలి ఆత్మహత్యాయత్నం చేసింది. కానీ, సోషల్ మీడియాలో 8వ తేదీ నుంచి ఆమెపై పోస్టులు మొదలయ్యాయ్. దీంతో వైసీపీ చేస్తోంది ఫేక్ ప్రచారం అని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ వల్లే ఆత్మహత్య చేసుకుందని చెప్పేవాళ్లు.. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు.. సైకిల్ పార్టీ మరికొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గీతాంజలిని ప్రతీరోజూ.. వైసీపీ సోషల్‌ మీడియా ఆఫీస్‌కు ఎందుకు తీసుకువచ్చే వారో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. గీతాంజలి బ్యాంక్ అకౌంట్‌లో వైసీపీవాళ్లు ఎందుకు డబ్బులు వేశారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. ఆమె ఫోన్‌ కాల్‌ రికార్డ్స్ ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీస్తున్నారు.

తెనాలి రైల్వేస్టేషన్‌లో ఆమెతో పాటు ఇద్దరు ఉన్నారని.. ఆ ఇద్దరు ఎవరు అని పోస్ట్ చేసిన టీడీపీ.. రైల్వేస్టేషన్ సీసీటీవీ ఫుటేజీ ఎందుకు బయటపెట్టడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఎందుకు.. ఎలా చనిపోయింది.. ఆమె మృతికి కారణం ఎవరో తేలాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఏమైనా గీతాంజలి వ్యవహారం.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపునకు కారణం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. టీడీపీ, వైసీపీ మధ్య.. మాటల తూటాలు పీక్స్‌కు చేరుకుంటున్నాయ్.