TDP THIRD LIST: చంద్రబాబు ఎవరికి హ్యాండ్ ఇచ్చారంటే..

11మంది అసెంబ్లీ, 13 పార్లమెంట్ అభ్యర్థులను టీడీపీ అనౌన్స్ చేసింది. మొదటి రెండు జాబితాల్లో సీట్లు దక్కని సీనియర్లలో ఒకరిద్దరికి ఇప్పుడు అవకాశం దక్కింది. కానీ మరికొందరికి మాత్రం షాక్ తప్పేలా లేదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి మూడో జాబితాలో టిక్కెట్ ప్రకటించలేదు.

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 01:39 PM IST

TDP THIRD LIST: ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులతో టీడీపీ థర్డ్ లిస్ట్ కూడా రిలీజ్ అయింది. అయినా ఇంకా కొందరు సీనియర్ల పేర్లు ఈ జాబితాలో కనిపించలేదు. 11మంది అసెంబ్లీ, 13 పార్లమెంట్ అభ్యర్థులను టీడీపీ అనౌన్స్ చేసింది. మొదటి రెండు జాబితాల్లో సీట్లు దక్కని సీనియర్లలో ఒకరిద్దరికి ఇప్పుడు అవకాశం దక్కింది. కానీ మరికొందరికి మాత్రం షాక్ తప్పేలా లేదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి మూడో జాబితాలో టిక్కెట్ ప్రకటించలేదు.

KODANDARAM : కోదండరామ్ కి MLC వస్తుందా ? కొత్త గవర్నర్ నిర్ణయం ఎప్పుడో…

చీపురుపల్లిలో మంత్రి బొత్సా సత్యనారాయణపై పోటీ చేయాలని గంటాకు చంద్రబాబు సూచించారు. కానీ ఆయన మాత్రం భీమిలీయే అడుగుతున్నారు. గంటాకు మిగిలింది చీపురుపల్లి మాత్రమే. అలాగే మరో సీనియర్ నేత కళా వెంకట్రావుకి ఇంకా టిక్కెట్ కేటాయించలేదు. ఎచ్చెర్ల సీటు పెండింగ్‌నే ఉంది. శ్రీకాకుళం కోసం మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి ప్రయత్నించారు. పాతపట్నం టిక్కెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే కలమట వెంటకరమణమూర్తికి కాకుండా కొత్తగా వచ్చిన మామిడి గోవిందరావుకి ఛాన్స్ దక్కింది. మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమకు హ్యాండ్ ఇచ్చారు. ఆ స్థానాన్ని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు కేటాయించారు. పెందుర్తి సీటును ఆశించిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి న్యాయం జరగలేదు.

గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కి టిక్కెట్ రాలేదు. తెనాలి సీటుకు పొత్తులో భాగంగా జనసేన తరపున నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. దాంతో గుంటూరు-2 లేదా పెనమలూరు స్థానాలపై ఆలపాటి ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ నుంచి నిరాశే ఎదురవడంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించారు. ఇంకా ఐదు అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాలే పెడింగ్‌లో ఉన్నాయి. టీడీపీ సీనియర్లలో ఎవరికి టిక్కెట్లు వస్తాయన్నది డౌట్‌గా ఉంది.