TDP, Chandrababu జనం చెప్పినోళ్ళకే టీడీపీ టిక్కెట్..! జగన్ ప్లాన్ కు బాబు కౌంటర్ ప్లాన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై వైసీపీ, టీడీపీ ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే 11 మంది ఇంఛార్జులను మార్చిన జగన్.. మరో 60 మంది ఎమ్మెల్యేలను కూడా ఛేంజ్ చేయబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా జగన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఉద్యోగులను ట్రాన్స్ ఫర్ చేసినట్టు.. నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడమేంటి అంటున్న బాబు.. తాను మాత్రం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా టీడీపీ అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తానని ప్రకటించారు.

వై నాట్ 175 అంటూ వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చుకుంటూ పోతున్నారు. ఇప్పటికి 11 మంది నియోజకవర్గ ఇంఛార్జులను మార్చారు. కొందరు సిట్టింగ్స్ కి ఎమ్మెల్యే టిక్కెట్స్ నిరాకరించగా.. మరికొందరిని ట్రాన్స్ ఫర్ చేశారు. 11 మంది కాదు.. మొత్తం 60 మందిని భవిష్యత్తులో మార్చే అవకాశం ఉందని టాక్స్ నడుస్తున్నాయి. వాళ్ళల్లో రోజా, అంబటి రాంబాబు సహా 10 మంది మంత్రులు కూడా ఉన్నారని అంటున్నారు. తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా.. వాళ్ళని మార్చకపోవడం వల్లే బీఆర్ఎస్ దెబ్బతిన్నదన్న టాక్ రావడంతో జగన్ ఏపీలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సర్వేలు నిర్వహించి అభ్యర్థులను మారుస్తున్నట్టు చెబుతోంది వైసీపీ.

అయితే జగన్ ప్లాన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ప్లాన్ తయారు చేశారు. ఈసారి జానామోదంతోనే టీడీపీ అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తామంటున్నారు. ఆఖరికి తాను పోటీ చేసే కుప్పం నియోజకవర్గంలో కూడా జనం ఒపీనియన్ తీసుకుంటామని చెప్పారు చంద్రబాబు. IVRS తో పాటు ఇతర మార్గాల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేయనుంది టీడీపీ. వైసీపీ అభ్యర్థులకు తాడేపల్లిలో ఆమోదం ఉంటే.. టీడీపీ క్యాండిడేట్స్ ని జనమే ఎంపిక చేస్తారని తేల్చి చెప్పారు చంద్రబాబు. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు.. జనం నుంచి ఓపీనియన్స్ ఎలా తీసుకుంటారు అన్నది సీక్రెట్ గా ఉంటుంది.. తనకు తప్ప ఎవరికీ తెలియదన్నారు టీడీపీ చీఫ్. అభ్యర్థులను కూడా తొందరగానే ఎంపిక చేస్తామని చెప్పారు.

జనసేనతో పొత్తులు తేలాక తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేస్తామంటున్నారు టీడీపీ చీఫ్. ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో కొన్ని నిర్ణయాలు ప్రకటించామనీ.. దీనికి ప్రజామోదం బాగుందని అంటున్నారు. మేనిఫెస్టోను కూడా తొందరగానే రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. వైసీపీ అసంతృప్తులకు టీడీపీ టిక్కెట్లు ఇవ్వదట. ఎవరైనా మంచోళ్ళు ఉంటే ఆలోచిస్తామంటున్నారు చంద్రబాబు. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు హోరా హోరీగా ఉండబోతున్నట్టు వైసీపీ, టీడీపీ ఎత్తులు చూస్తే అర్థమవుతోంది. గెలిచే వాళ్ళకే టిక్కెట్లు ఇవ్వాలని రెండు పార్టీలు డిసైడ్ అయ్యాయి. . అందుకే అభ్యర్థుల ఎంపిక నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జనసేనతో కలసి వెళ్తున్న టీడీపీ.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది.