ఇది కదా కిక్ అంటే… చెప్పి మరీ సెంచరీ కొట్టాడు

క్రికెట్ ఆడే ప్రతీ ప్లేయర్ మంచి ప్రదర్శనే ఇవ్వాలనుకుంటాడు..బ్యాటర్ అయితే సెంచరీ కొట్టాలని..బౌలర్ అయితే వికెట్లు తీయాలని..ఈ క్రమంలో కొన్ని సార్లు సక్సెస్ అవుతారు..మరికొన్ని సార్లు ఫెయిల్ అవుతారు...కానీ చెప్పి మరీ సెంచరీ కొడితే ఆ కిక్కు మాములుగా ఉండదు...

  • Written By:
  • Publish Date - November 14, 2024 / 03:44 PM IST

క్రికెట్ ఆడే ప్రతీ ప్లేయర్ మంచి ప్రదర్శనే ఇవ్వాలనుకుంటాడు..బ్యాటర్ అయితే సెంచరీ కొట్టాలని..బౌలర్ అయితే వికెట్లు తీయాలని..ఈ క్రమంలో కొన్ని సార్లు సక్సెస్ అవుతారు..మరికొన్ని సార్లు ఫెయిల్ అవుతారు…కానీ చెప్పి మరీ సెంచరీ కొడితే ఆ కిక్కు మాములుగా ఉండదు… ప్రస్తుతం టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ ఇదే కిక్ ఆస్వాదిస్తున్నాడు. తిలక్ వర్మ చెప్పి మరీ, వీరబాదుడు బాదాడని మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని తిలక్ తనని అడిగాడని, ముందే చెప్పినట్లుగా సెంచూరియ్ మ్యాచ్‌లో సత్తాచాటాడని అన్నాడు. మూడో టీ20లో తిలక్ వర్మ మూడో స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసారు.

తిలక్ వర్మ మినిమం గ్యారెంటీ ప్లేయరే…కానీ 20, 30 స్కోర్లతో జట్టులో కొనసాగడం అంత సులువు కాదని అర్థం చేసుకున్నాడు. దీంతో నాలుగు బదులు మూడో స్థానంలో వెళ్తానని కెప్టెన్ సూర్యను అడగడం, దానికి అతడు అంగీకరించడం.. తిలక్ కే కాదు టీమిండియాకు కూడా కలిసొచ్చింది. సెంచూరియన్ లో సెంచరీతో చెలరేగి.. సౌతాఫ్రికాపై మూడో టీ20లో టీమ్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. తనకు మూడో స్థానంలో అవకాశం ఇవ్వాలని కోరాడనీ, బాగా ఆడతానని చెప్పాడని సూర్య గుర్తు చేసుకున్నాడు. వెళ్లి చెలరేగిపో అని చెప్పడం..తను చేసి చూపించడం… చాలా ఆనందంగా ఉందనీ సూర్య కుమార్ చెప్పాడు.టీ20ల్లో ప్రస్తుతానికి మూడో స్థానంలో తిలకే కొనసాగుతాడని కూడా స్పష్టం చేశాడు.

మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన తిలక్ వర్మ మొదటి నుంచే టాప్ గేర్‌లో ఆడేస్తూ భారీ సిక్సర్లు బాదేసాడు. అభిషేక్ శర్మ తో రెండో వికెట్‌కి కేవలం 8.2 ఓవర్లలో 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తిలక్ వర్మ 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని కెరీర్ లో ఇదే తొలి టీ ట్వంటీ శతకం. వాస్తవానికి 22 ఏళ్ల తిలక్ వర్మ భారత టీ20 జట్టులోకి వచ్చి ఏడాదే అవుతోంది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 19 టీ20లు ఆడిన తిలక్ వర్మ.. 148.06 స్ట్రైక్ రేట్‌తో 496 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 219 పరుగులు చేసింది. ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 208 పరుగులకు పరిమితమైంది.