Teenmar Mallanna: అంతన్నావ్‌.. ఇంతన్నావ్‌.. కాంగ్రెస్‌లో చేరావ్‌.. వాటీజ్ దిస్ మల్లన్న..

కొన్ని రోజుల ముందు కూడా రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ కంటే ప్రమాదకరమైన వ్యక్తి అంటూ స్క్రీన్‌ మీద స్టేట్‌మెంట్‌లు ఇచ్చాడు. ఇప్పుడు అదే రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో పని చేయబోతున్నాడు. తెలంగాణలో దాదాపు అన్ని పార్టీలు కవర్‌ చేశాడు మల్లన్న.

  • Written By:
  • Publish Date - November 8, 2023 / 02:17 PM IST

Teenmar Mallanna: కేసీఆర్‌ కంటే రేవంత్‌ రెడ్డి (REVANTH REDDY) చాలా ప్రమాదకరం. ఇద్దరితో కంపేర్‌ చేస్తే కేసీఆరే (KCR) బెటర్‌. కాంగ్రెస్‌కు ఓట్‌ వేసే బదులు బీఆర్‌ఎస్‌కు ఓటేయడమే నయం. ఇవి మేం అంటున్న మాటలు కాదు. క్యూ న్యూస్‌ వ్యవస్థాపకుడు, తెలంగాణ నిర్మాణ పార్టీ అధ్యక్షుడు.. చింతపండు నవీన్‌.. అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న (Teenmar Mallanna) చెప్పిన మాటలు. ఇన్ని మాటలు చెప్పి, తీరా వెళ్లి అదే కాంగ్రెస్ (CONGRESS) పార్టీలో జాయిన్‌ అయ్యాడు తీన్మార్‌ మల్లన్న. ఇంతకాలం కాంగ్రెస్‌ పార్టీని మల్లన్న ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు.

TELANGANA CONGRESS: సూర్యాపేట, తుంగతుర్తి ఎవరికి.. కాంగ్రెస్‌లో ఆ 4 సీట్లు వారికేనా..

ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్‌ను ఏ రేంజ్‌లో ఆడుకుంటాడో.. రేవంత్‌ రెడ్డిని కూడా అదే రేంజ్‌లో ఆడుకున్నాడు. కొన్ని రోజుల ముందు కూడా రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ కంటే ప్రమాదకరమైన వ్యక్తి అంటూ స్క్రీన్‌ మీద స్టేట్‌మెంట్‌లు ఇచ్చాడు. ఇప్పుడు అదే రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో పని చేయబోతున్నాడు. తెలంగాణలో దాదాపు అన్ని పార్టీలు కవర్‌ చేశాడు మల్లన్న. ఇదే కాంగ్రెస్‌ నుంచి గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. ఓడిపోయిన తరువాత జర్నలిస్ట్‌గా మారాడు. తరువాత బీజేపీలో జాయిన్‌ అయ్యాడు. ఆ తరువాత ఆ పార్టీ కూడా నచ్చకపోవడంతో.. తానే కొత్త పార్టీ పెట్టి ఉద్దరిస్తానంటూ తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టాడు. తెలంగాణను పట్టించుకునేవాడే లేడు.. ఇప్పుడు నేను వచ్చి పాలన అంటే ఏంటో చూపిస్తా అన్న రేంజ్‌లో స్పీచ్‌లు ఇచ్చాడు.

PAWAN KALYAN: తెలంగాణలో పవన్ రాంగ్‌ స్టెప్‌.. బొక్కాబోర్లా పడడం ఖాయమా..

మేడ్చల్‌ నుంచి పోటీ చేస్తా.. ప్రజలు ఆశీర్వదించాలంటూ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాడు. బ్యాగ్రౌండ్‌లో ఏం జరిగిందో తెలియదు కానీ.. కట్‌ చేస్తే బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. ఇంతకాలం అదే పార్టీని తిట్టి.. ఇప్పుడు అదే పార్టీకి ఓటు వేయాలని మల్లన్న ప్రజలను ఎలా అడుగుతాడు అంటున్నారు ఆయనను రోజూ ఫాలో అయ్యేవాళ్లు. ఆ విషయం పక్కన పెడితే.. మల్లన్న పోటీ చేయాలి అనుకున్న మేడ్చల్‌ నుంచి కాంగ్రెస్‌ తన అభ్యర్థిని ఆల్రెడీ ప్రకటించింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌కు వెళ్లి మల్లన్న ఏం చేస్తాడు అనేది మరో ప్రశ్న. మంచో చెడో.. ప్రజల్లో మల్లన్న ఓ మార్క్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. ఆయన న్యూస్‌ చూసే ప్రేక్షకులు లక్షల్లో ఉంటారు. ఇంతకాలం వాళ్లందరికీ మల్లన్న ఓ తిరుగుబాటు జర్నలిస్ట్‌గానే తెలుసు. ఏ పార్టీకి కొమ్ముకాయని వ్యక్తిగానే తెలుసు.

కానీ ఇప్పుడు మాత్రం తిట్టిన పార్టీలోనే జాయిన్‌ అయ్యి.. తన క్రెడిబులిటీ తానే దెబ్బతీసుకున్నాడు అంటున్నారు మల్లన్న దగ్గరి వ్యక్తులు. మరి మల్లన్న సడెన్‌గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు.. అసలు ఎన్నికల్లో అయినా పోటీ చేస్తాడా.. ఈ ప్రశ్నలకు మల్లన్నే సమాధానం చెప్పాలి.