Telangana 2023-24 Exams: ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా ప్రోఫెషనల్ కోర్సుల్లో ప్రవేశ పరీక్షల తేదీ విడుదల

  • Written By:
  • Updated On - February 13, 2023 / 12:55 PM IST

తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రొఫెషనల్‌ కోర్సులలో ప్రవేశాల కోసం 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎమ్‌సెట్‌తో పాటు మరికొన్ని ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ప్రకటించారు. ఇందులో భాగంగా మొత్తం 07 ప్రవేశ పరీక్షా తేదీల వివరాలను విడుదల చేశారు. జేఎన్టీయూ నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్‌ 2023 ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలను మే 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఎంసెట్ వ్యవసాయ (అగ్రీ) అండ్ ఫార్మా విభాగానికి సంబంధించిన తేదీలను విడుదల చేశారు. ఈ అగ్రి, ఫార్మా సంబంధిత కోర్సుల పరీక్షలను మే 12 నుంచి 14 వరకు నిర్వహిస్తారని తెలిపారు.

వీటితో పాటు
టీఎస్‌ ఎడ్‌సెట్‌ మే 18న,
టీఎస్‌ ఈసీఈటీ మే 20వ తేదీన,
టీఎస్‌ లాసెట్‌ మే 25న,
టీఎస్‌ ఐసెట్‌ మే 26,27
టీఎస్‌ పీజీఈసెట్‌ను మే 29, 30, 31, తోపాటూ జూన్ 1న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

అన్ని రకాల ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను మంత్రి సబిత ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి, వైస్‌-ఛైర్మన్‌ ప్రొ. వి. వెంకట రమణతో పాటూ ఇతర అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ పరీక్షలను సుజువుగా నిర్వహించేందుకు అధికారులంతా సమిష్టిగా కృషి చేయాలని సబితా అధికారులకు సూచించారు.