Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి నాలుగు అంచెల భ‌ద్ర‌త.. ఎందుకో తెలుసా..?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీకి నాలుగు అంచెల భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. భారీ బందోబ‌స్తు మ‌ధ్య మంగళవారం అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగాయి.

 

 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీకి నాలుగు అంచెల భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. భారీ బందోబ‌స్తు మ‌ధ్య మంగళవారం అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగాయి. పబ్లిక్‌ గార్డెన్‌ బస్‌స్టాండ్‌ దగ్గర భారీ ఎత్తుతో కంచెలను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ లోపలికి వెళ్లే దగ్గర రెండు రకాల కంచెలను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న కంచెను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తీసివేస్తామని.. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కన్న ముడు రెట్లు కంచెలను ఏర్పాటు చేసింది రేవంత్ సర్కర్. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నిరుద్యోగులను గాలికి వదిలేసిందని యావత్ నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ బడ్జెట్ సమయంలో విద్యార్థి సంఘాలు అసెంబ్లీ ముట్టడిస్తామని సమాచారంతో గతంలో ఎప్పుడు లేని విధంగా అసెంబ్లీ భారీ భద్రత అవరణంలోకి వెళ్లిపోయింది. మరో వైపు నిన్న కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేటాయించిన బడ్జెట్ వివక్ష జరిగిందని తెలంగాణ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

ప్రస్తుతం శాసన సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కేంద్రంలో బడ్జెట్ అనంతరం కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి జరిగిన అన్యాయంపై సర్కార్ తీర్మానం చేయనుంది. అలాగే హైదరాబాద్ అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు, జాబ్‌ క్యాలెండర్‌, నిరుద్యోగుల ఆందోళనపై ఉభయ సభల్లో బిఆర్ఎస్ వాయిదా తీర్మానం చేయనుంది.

Suresh SSM