Telangana Assembly : కేసీఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన రేవంత్‌..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Meetings) హాట్‌హాట్‌గా సాగుతున్నాయ్. నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్‌లో.. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS)శ్రేణులు యుద్ధం చేస్తున్నాయ్.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Meetings) హాట్‌హాట్‌గా సాగుతున్నాయ్. నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్‌లో.. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS)శ్రేణులు యుద్ధం చేస్తున్నాయ్. కేసీఆర్ (KCR) హయాంలో భారీగా అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తుంటే.. ఇచ్చిన హామీల సంగతేంటని కారు పార్టీ నేతలు నిలదీస్తున్నారు. ఈ మాటల యుద్ధంలో బడ్జెట్ మీద చర్చ ఆగిపోయింది. ఐతే ఎలాగైనా సరే ప్రతీ అంశం చర్చించాలని ఫిక్స్ అయిన రేవంత్ సర్కార్‌ (Revanth Sarkar) .. కేసీఆర్ రికార్డులను బ్రేక్ చేసింది. బడ్జెట్‌ (Budget Meetings) పై జరిగిన చర్చ.. తెలంగాణ రాష్ట్ర శాసనసభ చరిత్రలో హిస్టరీని తిరగరాసింది.

సోమవారం ఉదయం మొదలైన సమావేశం… మంగళవారం ఉదయం మూడు గంటల 15 నిమిషాల వరకు కొనసాగింది. ఇది అసెంబ్లీ రికార్డులను బద్దలు కొట్టింది. సోమవారం ఉదయం ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని రద్దుచేసి అసెంబ్లీలో పద్దులపై చర్చ కొనసాగించారు. 19 శాఖల పద్దులపైన జరిగిన చర్చ… దాదాపు 17గంటలకు పైగా సాగింది. సోమవారం ఉదయం 10గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా సాయంత్రం నాలుగు గంటల 40 నిమిషాల నుంచి 5 గంటల 50 నిమిషాల వరకు టీ బ్రేక్ ఇచ్చారు.

ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీ మొదలైంది. అది మంగళవారం ఉదయం 3 గంటల 15నిమిషాల వరకు కొనసాగింది. బడ్జెట్‌పై జరిగిన ఈ చర్చలో 19 పద్దులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆ తర్వాత శాసనసభను స్పీకర్ ప్రసాద్ కుమార్.. సభను మంగళవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. దీంతో తెలంగాణ శాసనసభలో రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలో కొత్త రికార్డు క్రియేట్ అయింది. గతంలో కేసీఆర్ రికార్డును ప్రస్తుత సీఎం రేవంత్ బద్దలు కొట్టారు. గతంలో కేసీఆర్‌ అర్ధరాత్రి 12గంటల వరకు అసెంబ్లీని కొనసాగించారు. అప్పట్లో అది రికార్డు.. ఇప్పుడు సుమారు ఏకంగా ఒకటే రోజులో 17గంటలకు పైగా అసెంబ్లీని కొనసాగించి కేసీఆర్ రికార్డును పక్కకు నెట్టారు రేవంత్‌.