నేటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. ఈ సమావేశంల్లో ముందుగా కారు ప్రమాదంలో మరణించిన దివంగత మాజీ ఎమ్మెల్యే లాస్య నందితకు శాసనసభలో సభ్యులు సంతాపం తెలపనున్నారు.
అనంతరం సభ వ్యవహారాల కమిటీ భేటీలో అసెంబ్లీ నిర్వహణ, చర్చించాల్సిన అంశాలు మొదలైన వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ, ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అనంతరం సభను వాయిదా వేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జులై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలకు ముందుగా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. జులై 25 ను బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నా సీఎం, డిప్యూటీ సీఎం.. 25న అసెంబ్లీకి హాజరై తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెడతారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మరో వైపు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ వస్తున్నట్లు సమాచారం.. కాగా ఈ సారైన కేసీఆర్ సభకు వస్తారా..? అనేది 25 వరకు వేచి చూడక తప్పదు.