TELANGANA BJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. పార్లమెంట్ స్థానాలకు ఇంచార్జిల నియామకం..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ దృష్టిపెట్టబోతుంది. అయితే, తాజాగా ప్రకటించిన స్థానాల్లో సిట్టింగు ఎంపీలకు కాకుండా.. వేరేవారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం విశేషం.

  • Written By:
  • Publish Date - January 8, 2024 / 02:02 PM IST

TELANGANA BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మోస్తరు ఫలితాలు సాధించిన బీజేపీ.. తాజాగా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ముందస్తు సన్నాహాల్లో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఇంచార్జిలను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పేరుతో పత్రికా ప్రకటన విడుదలైంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ దృష్టిపెట్టబోతుంది. అయితే, తాజాగా ప్రకటించిన స్థానాల్లో సిట్టింగు ఎంపీలకు కాకుండా.. వేరేవారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం విశేషం. నియోజకవర్గ ఇంచార్జిలుగా నియమితులైంది వీళ్లే.

జహీరాబాద్‌- వెంకటరమణారెడ్డి
నిజామాబాద్- ఆలేటి మహేశ్వర్‌రెడ్డి
ఆదిలాబాద్-పాయల్‌ శంకర్
పెద్దపల్లి-రామారావు
చేవెళ్ల- వెంకట్‌నారాయణ రెడ్డి
మల్కాజ్‌గిరి- రాకేష్ రెడ్డి
మెదక్‌- హరీష్‌బాబు
కరీంనగర్-ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా
ఖమ్మం- పొంగులేటి సుధాకర్‌రెడ్డి
సికింద్రాబాద్-లక్ష్మణ్‌
హైదరాబాద్‌ – రాజాసింగ్
భువనగిరి- ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌రెడ్డి
మహబూబ్‌నగర్‌- రామచంద్రరావు
మహబూబ్‌నగర్‌- గరికపాటి రామ్మోహన్‌రావు
నాగర్‌కర్నూల్- మారం రంగారెడ్డి
నల్గొండ- చింతల రాంచంద్రారెడ్డి
వరంగల్‌- మర్రి శశిధర్‌ రెడ్డి