నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana, State Government) రాష్ట్ర బడ్జెట్ (State Budget) ను ప్రవేశ పెట్టనుంది. దీంతో ఇవాళ ఉదయం గం.9 కి తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం.. 2024-25 బడ్జెట్‌పై చర్చలు జరిపి, ఆమోద ముద్ర వేసింది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో (Telangana Assembly Sessions) అనంతరం డిప్యూటీ CM, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అనంతరం శాసనమండలిలో (Legislative Council) మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ (Congress) పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. బడ్జెట్ వ్యయం ₹2.80లక్షల కోట్ల నుంచి ₹2.90లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా..
బడ్జెట్ ఆమోదానిక ముందే.. తెలంగాణ బడ్జెట్ పద్దుతో నల్లపోచమ్మ ఆలయంలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క-నందిని దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ మందిరానికి సతీసమేతంగా వచ్చిన భట్టివిక్రమార్క.. అమ్మవారి ఎదుట బడ్జెట్ ప్రతులను ఉంచి.. పూజలు నిర్వహించారు. పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీకి చేరుకోనున్నారు. మరో వైపు తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పేడుతున్న నేపథ్యంలో నేడు అసెంబ్లీకి బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది.