Telangana Cabinet : నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం..

ఇవాళ సాయంత్రం మధ్యాహ్నం 3.30 గంటలకు CM రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయం(Telangana Secretariat) లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది.

ఇవాళ సాయంత్రం మధ్యాహ్నం 3.30 గంటలకు CM రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయం(Telangana Secretariat) లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో GST బిల్లును ఆమోదించడం, అడ్వకేట్ జనరల్ (Advocate General) నియామకానికి ఆమోదం, పంచాయతీరాజ్ (Panchayat Raj) చట్టంలో స్వల్ప సవరణలు, గత ప్రభుత్వం సిద్ధంచేసిన 3 బిల్లుల రద్దు, గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీ, మరో 2 హామీల అమలు, వచ్చే బడ్జెట్ (Budget) సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటుగా.. వాహనాల నెంబర్ ప్లేట్‌లలో టీఎస్‌(TS) కు బదులుగా టీజీ(TG) గా మారుస్తూ క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ పథకాలకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. మరోవైపు కులగణనకు కూడా ఆమోదముద్ర వేయనున్నారు. అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాల నిర్వాహాణపై మంత్రులు నిర్ణయించనున్నారు.