Telangana CM : తెలంగాణ సీఎం అభ్యర్థి ఖరారు.. నేడు హైదరాబాద్ కి సీల్డ్ కవర్

తెలంగాణ నూతన సీఎం ఎంపికపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మంగళవారం ఉదయం కీలక ప్రకటన చేశారు. ఈరోజే సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తామని, సాయంత్రం లోపు సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తామని ఖర్గే క్లారిటీ ఇచ్చారు. తెలంగాణకు పంపిన పార్టీ పరిశీలకుల నివేదికను పరిశీలించి.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పార్టీలో పలువురు సీనియర్ నేతలతో చర్చించిన అనంతరం సీఎం పేరును ప్రకటిస్తామని చెప్పారు.

తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ప్రశాంతంగా EVM కౌంటింగ్ జరిగింది. స్పష్టంగా ప్రజలు ఈసారి కాంగ్రెస్ కు పట్టం కట్టారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా ఎత్తి వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కానీ ఇప్పుడు ఉన్న చిక్కు అల్లా.. తెలంగాణ తదుపరి రెండు సీఎం ఎవరు అన్న ప్రశ్న అన్న మదిలో తలెత్తుతుంది. తెలంగాణ ఇచ్చి పార్టీగా కాంగ్రెస్ ఉంటే.. తెలంగాణ తెచ్చిన పార్టీగా (టీఆర్ఎస్) బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గారిని సీఎంగా పార్టీ చెప్పుకొచ్చింది. కానీ కాంగ్రెస్ లో అలా లేదు ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్ధి ఎవరు అని ఇంత వరకు ఏఐసీసీ ఆగ్ర నేతలు కూడా తేల్చే లేకపోయారు. మీరు ఎవరికి సీఎం అయ్యే అర్హత అవకాశం ఉంది అంటే కాంగ్రెస్ అడిగితే అందులో డజన్ల కొంది సీనియర్ నాయకులు ఉన్నారు..

Rajini Saichand: తన పదవికి రాజీనామా చేసిన సాయిచంద్‌ భార్య రజినీ

నిన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకు అధ్యక్షతన సీఎల్పీ నేతల సమావేశం అయిన అందులో సీఎం ఎవరు అనేది తేల్చలేక పోయారు. సీఎం పదవికి సీనియర్లు పోటీ పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. కాగా సీఎం ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అగ్రనేతకు అప్పగించింది తెలంగాణ కాంగ్రెస్. అయిన సరే సీఎం ఎవరు అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే విషయాన్ని వారు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నివేదించారు.. ఈ విషయంపై ఖర్గే మంగళవారం ఉదయం ఓ క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణ నూతన సీఎం ఎంపికపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మంగళవారం ఉదయం కీలక ప్రకటన చేశారు. ఈరోజే సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తామని, సాయంత్రం లోపు సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తామని ఖర్గే క్లారిటీ ఇచ్చారు. తెలంగాణకు పంపిన పార్టీ పరిశీలకుల నివేదికను పరిశీలించి.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పార్టీలో పలువురు సీనియర్ నేతలతో చర్చించిన అనంతరం సీఎం పేరును ప్రకటిస్తామని చెప్పారు.

సీఎం పదవి రేసులో ప్రస్తుత టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. సీఎం కుర్చీ కోసం మరో వ్యక్తి CLP నేత భట్టి విక్రమార్క పోటీ పడుతున్నారు. ఇక మాజీ టీపీసీసీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం పోటీలో ఉన్నారు. కాగా.. సోమవారం సాయంత్రమే హస్తినకు చేరుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైకమాండ్ పెద్దలను కలిసి సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో తమ పేర్లను కూడా పరిశీలించాలని వీరు కోరనున్నట్లు సమాచారం.. సీఎం ఎంపిక చేసి.. తెలంగాణ సీఎం అభ్యర్థి పేరున్న సీల్డ్ కవర్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు.