REVANTH REDDY: ఆగష్టు 15లోపు రుణమాఫీ చేస్తాం.. కేసీఆర్, మోదీ.. ఇద్దరూ ఒక్కటే: రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఐదు గ్యారంటీలు అమలు చేశాం. ఉచిత బస్సుల్లో 35 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి అండగా ఉన్నాం. ఆడబిడ్డలకు 5 వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఉచిత కరెంటు ఆపాలని మోడీ, కేసీఆర్ కాంగ్రెస్‌ను పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - April 22, 2024 / 07:48 PM IST

REVANTH REDDY: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేశామని, ఆరో గ్యారెంటీ అయిన రైతు రుణమాఫీని ఆగష్టు 15లోగా అమలు చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన ‘జనజాతర’ సభల్లో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ, కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. “త్వరలోనే రూ.2 లక్షల రుణమాఫీ చేసుకోబోతున్నాం. ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ పూర్తిగా చేసి తీరుతాం.

Delhi CM Kejriwal: కేజ్రీవాల్‌కి ఇన్సులిన్ ఇవ్వాలి.. ఆయన్ని జైల్లో చంపేస్తారేమో: ఆప్

తెలంగాణలో ఐదు గ్యారంటీలు అమలు చేశాం. ఉచిత బస్సుల్లో 35 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి అండగా ఉన్నాం. ఆడబిడ్డలకు 5 వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఉచిత కరెంటు ఆపాలని మోడీ, కేసీఆర్ కాంగ్రెస్‌ను పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉచిత కరెంటుతో పేదల ఇళ్లు వెలుగుతుంటే వాళ్ల కడుపు మండుతోంది. పదేళ్లు పాలించిన కేసీఆర్ ఎవ్వరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. కానీ కేసీఆర్, ఆయన కుమారుడు కట్టుకున్నారు. వంద రోజుల్లో కాంగ్రెస్ ఏమీ చేయలేదని విమర్శించే బీజేపీ, బీఆర్‌ఎస్‌లను నడిరోడ్డు మీద ఉరితీయాలా.. ఆలోచించాలి. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కట్టలేదు. గిరిజన యూనవర్సిటీని ఆపారు. కేసీఆర్, మోడీ పదేళ్లుగా పాలన చేసిన వారిద్దరు ప్రజలకు ఏం చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అన్నదాత పండించిన ప్రతి గింజ కొంటున్నాం. పదేళ్లలో కేసీఆర్‌ ఉద్యోగాలు ఇవ్వకుంటే.. కాంగ్రెస్‌ మాత్రం మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది. నిజామాబాద్‌ అంటే నాకు ప్రత్యేక అభిమానం. గతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చి బీజేపీ ఎంపీ అర్వింద్ మోసం చేశారు. ఈ బోర్డు ఏర్పాటుపై మోదీ ఇచ్చిన ప్రకటనలో ఎక్కడా నిజామాబాద్‌ పేరు లేదు. ఎన్నికలయ్యాక బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలియదు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడి రైతులను పట్టించుకోలేదు.

కడెం ప్రాజెక్టుకు మరమ్మతుల కోసం నిధులు ఇచ్చాం. బోథ్ ప్రాంతంలో కుప్టీ ప్రాజెక్టు నిర్మిస్తాం. తుమ్మడిహట్టిలో ప్రాజెక్టు నిర్మిస్తాం. తుమ్మిడిహట్టిలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కడతాం. దానికి బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెడతాం. సెప్టెంబర్‌ 17లోపు చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తాం. ఆదిలాబాద్‌లో గిరిజన యూనివర్శిటి ఏర్పాటు చేస్తాం. మోడీ, కేడీ కలిసి సిమెంట్ కర్మాగారాన్ని అలానే ఉంచారు. ఆదిలాబాద్‌లో మూతపడ్డ సిమెంట్ పరిశ్రమను తెరిపిస్తాం. మోడీ నిధులన్నీ గుజరాత్‌కు తీసుకెళ్లారు. పదేళ్లు బీజేపీకి అధికారం ఇచ్చారు. కాంగ్రెస్‌కు పదేళ్లు అవకాశం ఇవ్వాలి. విపత్కర పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కాపాడాలంటే మళ్లీ కాంగ్రెస్‌ గెలవాలి. కేంద్రంలో కాంగ్రెస్‌ కూటమి తప్పక ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నాగోబా జాతరకు రూ.4 కోట్లు కేటాయించనున్నాం. బీసీ జనగణన చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది’’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.