CM Revanth on Metro : పోతే పోనీ…L & T పోతే నష్టం లేదు: సీఎం రేవంత్

హైదరాబాద్ మెట్రో రైలును నడిపిస్తున్న L & T పోతే వచ్చే నష్టం ఏమీ లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో రైల్ నుంచి వైదొలుగుతామన్న L & T పై మండిపడ్డారు.

హైదరాబాద్ మెట్రో రైలును నడిపిస్తున్న L & T పోతే వచ్చే నష్టం ఏమీ లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో రైల్ నుంచి వైదొలుగుతామన్న L & T పై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తోంది. దీని వల్ల తమకు నష్టం వస్తోందనీ… ఇలాగైతే 2026 తర్వాత హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటామని L &T ప్రెసిడెంట్, డైరెక్టర్ శంకర్ రామన్ ఈమధ్యే ప్రకటించారు.

దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామన్న కాంగ్రెస్ హామీని… మెట్రో రైలుకి నష్టం వస్తుందని ఆపే ప్రసక్తే లేదన్నారు. ఎల్ అండ్ టీకి నష్టం వచ్చినా… లాభం వచ్చినా తాము బాఢపడబోమన్నారు. L & T పోతే పోనీయండి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్థలకు అవకాశం ఇస్తుందని రేవంత్ కామెంట్ చేశారు. కార్పొరేట్ల ఇష్టాయిష్టాలు, ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పనిచేయదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

ప్రజల సంక్షేమం… ముఖ్యంగా మహిళల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేయడమనేది కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రాధాన్యత. ఏది ఏమైనా సరే… ఫ్రీ బస్ స్కీమ్ కొనసాగి తీరుతుంది. ప్రతి నెలా ఆర్టీసీకి ప్రభుత్వం డబ్బులు కూడా రీయింబర్స్ చేస్తోందన్నారు రేవంత్. ఉచిత బస్సు పథకం కారణంగా ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుందని హామీ ఇచ్చారు.