తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) చాలా రసవంతంగా మారాయి.. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది.. ప్రధాన పార్టీలు మాటల తూటాలను పెలచ్చుకుంటుననాయి. ఇది వరకు ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఫూల్ ఫామ్ లో ఉండగా.. రెండు, మూడు రోజులుగా.. కాంగ్రెస్ కూడా ఎన్నికల ప్రచారంలో జోరు పెంచింది. అధికార పార్టీకి నువ్వా నేనా.. అన్నట్లు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు రామగుండం లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చుతూ.. కేసీఆర్ పై ఓ రేంజ్ లో విరుచుకపడ్డారు.
Visakhapatnam: విశాఖలో మద్యం లారీ బోల్తా.. బాటిళ్లు ఎత్తుకెళ్లిన మందుబాబులు..
రామగుండం (Ramagundam) లో ఓపెన్ కాస్ట్ మైనింగ్ లు బంద్ చేయిస్తాను అన్న కేసీఆర్ ఫామ్ హౌస్ పడుకుండు. ఇసుక, బొగ్గు, బూడిద ఏదీ వదలకుండా దోచుకుని ఇక్కడి ఎమ్మెల్యే బంధిపోటు దొంగలా మారిండు. కల్వకుంట్ల కుటుంబానికి కప్పం కడుతుండు కాబట్టే మళ్లీ ఎమ్మెల్యేకు టికెట్ కేటాయించిండు. సింగరేణి కార్మికుల ఎన్నికలను కోర్టుకు పోయి వాయిదా వేయించిండు. కేసీఆర్ మగాడు అయితే సింగరేణి ఎన్నికలను ఎందుకు జరపలేదు అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
TS RTC good news : కార్తీక మాసం లో తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త..
చీకట్లో మగ్గుతున్న రామగుండంలో వెలుగులు నిండాలంటే కాంగ్రెస్ గెలవాలి. ప్రతీ నెలా రేషన్ సన్న బియ్యం రావాలంటే కాంగ్రెస్ గెలవాలి. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ జరగాలన్నా, ఉద్యోగాల భర్తీ జరగాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. మహిళలకు ప్రతీ నెలా రూ.2500 రావాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలి. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. బిల్లు చూడగానే కరెంట్ షాక్ కొట్టే పరిస్థితి.. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు.. రైతు కూలీలకు రూ.12వేలు అందిస్తాం. చేయూత పథకం ద్వారా నెలకు రూ.4000 పెన్షన్ అందిస్తాం. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి.