TELANGANA: తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జి మంత్రుల నియామకం..

ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

  • Written By:
  • Updated On - December 24, 2023 / 08:16 PM IST

TELANGANA: తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జి మంత్రులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

Revanth Reddy: డిసెంబర్ 28 నుంచి ప్రజా పాలన.. ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు

ఇక.. ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులుగా నియమితులైన వాళ్లు ఆ జిల్లాల్లో పాలన పరమైన అంశాలు, ప్రభుత్వ పథకాలను సమీక్షిస్తారు. జిల్లాలో ప్రజావాణి, ప్రజా పాలన వంటి కార్యక్రమాల అమలును సమీక్షించి, పర్యవేక్షించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ త్వరలోనే ఆరు గ్యారెంటీలను అమలు చేయబోతున్న సంగతి తెలిసిందే. హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇందులో రెండు హామీల్ని ఇప్పటికే అమలు చేస్తోంది. మిగతా వాటిని అమలు చేసే ఉద్దేశంతో ఈ నెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించబోతుంది. ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జి మంత్రులు వీళ్లే.

1. కరీంనగర్‎: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
2. మహబూబ్ నగర్: దామోదర రాజనరసింహ
3. ఖమ్మం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
4. రంగారెడ్డి: దుద్దిళ్ల శ్రీధర్ బాబు
5. వరంగల్: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
6. హైదరాబాద్: పొన్నం ప్రభాకర్
7. మెదక్: కొండా సురేఖ
8. ఆదిలాబాద్: అనసూయ సీతక్
9. నల్గొండ: తుమ్మల నాగేశ్వర రావు
10. నిజామాబాద్: జూపాల్లి కృష్ణారావు