సాధారణంగా ఉదయం లేచిన మొదలు వాట్సప్ చాటింగ్, ఫేస్ బుక్ లైక్, ఇంస్టా పోస్టింగ్, ట్విట్టర్ కామెంట్, యూట్యూబ్ షేర్ చూస్తూ ఉంటాము. దీనిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఒక కాంటెస్ట్ ను తీసుకువచ్చింది. మనలోని క్రియేటివిటీని తట్టి లేపేందుకు ఒక సువర్ణావకాశాన్ని కల్పించింది. దీనికి వయసు పరిమితిలేదు. 18 ఏళ్లు దాటిన అన్నివయసుల వారు ఇందులో పాల్గొనవచ్చు. తమ నైపుణ్యాన్ని చూపించవచ్చు. ఒకవేళ మీరు చేసిన వీడియో సర్కార్ కి నచ్చితే మీరే విజేతలుగా నగదు బహుమతిని అందుకోవచ్చు.
ప్రస్తుతం నవ భారతంలో యుతతరం పెరిగింది. వీరిలో కొందరు పెడదారిపడుతున్నారు. తమ ఉజ్వల భవిష్యత్తును అందకారంలోకి నెట్టుకుంటున్నారు. దీనికి ప్రదాన కారణం డ్రగ్స్ అని భావించి ఇలాంటి మహోత్తర కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈ పోటీ ముఖ్య ఉద్దేశ్యం డ్రగ్స్ తీసుకున్న వారి జీవితం ఎలా మారిపోయింది. వారి కుటుంబ సభ్యులు పడుతున్న వేదనను ఈ వీడియోలో చూపించాలి. అందులో భాగంగానే ఎలా అడిక్ట్ అవుతాడు, దీనికి బానిస అవ్వడం వల్ల ఎలాంటి ప్రభావం తమ కుటుంబంపై పడుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏంటి అనే అంశాలను సృశిస్తూ ఆసక్తిగా సాగేలా వీడియోలను చిత్రీకరించాలి. దీని నిడివి మూడు నిమిషాలు మించకుండా చూసుకోవాలి.
నేటి సమాజంలో ఎవరికి వారే క్రియేటివిటీ రథసారధులు అని గుర్తించింది సర్కార్. అందుకే ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అంతర్జాతీయ డ్రగ్స్ అండ్ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దీనిని నిర్వహించాలని సంకల్పించింది. అందుకే జూన్ 26న ఈ షాట్ వీడియో కాంటెస్ట్ కు పూనుకుంది. ఈ కార్యక్రమాన్ని ‘డ్రగ్స్ అండ్ ఇట్స్ ఎడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ, పేరుతో పోలీస్ శాఖ నిర్వహిస్తుంది.
ఈ పోటీలో పాల్గొనాలంటే కనీస వయసును 18 ఏళ్లుగా నిర్ణయించింది. సర్కార్ చెప్పిన పూర్తి కాన్సెప్ట్ ను మూడు నిమిషాల్లోపూ తీసి ఆ వీడియోను జూన్ 20వ తేదీ లోపూ పంపాల్సి ఉంటుంది. ప్రభుత్వం దృష్టికి వచ్చిన వీడియోల్లో మంచి వాటిని ఎంపింక చేసి మూడు రకాలుగా విభజిస్తారు. ఫస్ట్ ఫ్రైజ్ విన్నర్ కు రూ. 75,000, రెండవ స్థానంలో నిలిచిన వారికి రూ. 50,000, మూడవ ప్లేస్ లో నిలిచిన విజేతకు రూ. 30,000 నగదు బహుమతిని అందించనున్నట్లు తెలిపింది. ఈ సువర్ణావకాశంలో పాల్గొని.. తమ అపారమైన ప్రతిభా పాఠవాలను కనబరచాలనే ఆసక్తికలిగిన వారు మరింత సమాచారం కోసం 96523 94751 నంబర్ కు సంప్రదించవచ్చు.
T.V.SRIKAR