Ponguleti Srinivasa Reddy: ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో ఇప్పటికే రెండింటిని కాంగ్రెస్ అమలు చేస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఆరోగ్య శ్రీ పరిమితి పది లక్షలకు పెంపు అమలు చేస్తోంది. మిగిలిన నాలుగింటిపై కాంగ్రెస్ దృష్టిపెట్టింది.
T CONGRESS: తెలంగాణ కాంగ్రెస్‌లో కుమ్ములాట? ఇంఛార్జ్‌ను మార్చిన ఏఐసీసీ
దీనిలో భాగంగా ఆరు గ్యారెంటీల్ని పూర్తిగా అమలు చేసేందుకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఇందుకోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభల్లో నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమాల్లో దరఖాస్తుల్ని స్వీకరించబోతున్నట్లు పొంగులేటి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ”ప్రభుత్వ పథకాలు పొందే అర్హత ఉన్న వారు గ్రామ సభల్లో అధికారులకు దరఖాస్తులు అందజేయాలి. ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన అనంతరం అధికారులు వారికి ఒక రశీదు అందజేస్తారు. ప్రజల వద్దకే అధికారులు స్వయంగా అక్కడికి వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తైన అనంతరం ప్రజలు ఏ పథకానికి అర్హులో అధికారులే నిర్ణయిస్తారు” అని పొంగులేటి తెలిపారు.
లబ్ధిదారుల ఎంపిక పేరుతో ప్రభుత్వ పథకాల్లో కోత పెట్టబోమని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గ్రామసభలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ధరణి పోర్టల్ ద్వారా కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకుని, పేదలకు పంచుతామన్నారు. ప్రజా పాలన సభలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం.2 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సా.5 గంటల వరకు జరుగుతాయి.