KCR : కేసీఆర్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్‌‌ను రద్దు చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే...

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్‌‌ను రద్దు చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. దీంతో కేసీఆర్.. కమిషన్ విచారణకు హాజరుకానున్నారు.

ఈ కమిషన్.. ఇప్పటికే 2సార్లు కేసీఆర్‌కి నోటీసులు ఇచ్చింది. ఐతే.. దీనిపై కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు. విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ఒప్పందాల విషయంలో తమ ప్రభుత్వం అన్నీ పద్ధతిగా చేసిందనీ, ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని చెబుతూ కేసీఆర్ ఇటీవల 8 పేజీల లేఖను కమిషన్‌కి పంపారు. అంతేకాదు.. కమిషన్ నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలని కోరారు.