LIGHT BEERS: తెలంగాణలో లైట్ బీర్ల కరువు.. మందుబాబు చేసిన పనికి షాక్‌..

లైట్‌ బీర్లు దొరకడం లేదని.. ఓ మద్యం ప్రియుడు ప్రభుత్వానికే లేఖ రాశాడు. లైట్ బీర్ల కొరతను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశాడు. ఇది తన ఒక్కరి ఫిర్యాదు కాదని.. లైట్ బీర్లు తాగే ప్రతి ఒక్కరి తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నానని రాశాడు.

  • Written By:
  • Publish Date - April 30, 2024 / 01:16 PM IST

LIGHT BEERS: తెలంగాణలో లైట్ బీర్లకు కొరత ఏర్పడింది. దీనిపై మూడురోజులుగా సోషల్‌ మీడియాలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. మీమ్స్, ట్రోల్స్‌.. మాములుగా లేవ్‌. ఐతే లైట్‌ బీర్లు దొరకడం లేదని.. ఓ మద్యం ప్రియుడు ప్రభుత్వానికే లేఖ రాశాడు. లైట్ బీర్ల కొరతను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశాడు. ఆ లెటర్‌ రాసిన వ్యక్తి పేరు.. కొట్రంగి తరుణ్.

Heat Waves In AP-TS: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. ఈ జిల్లాలకు వడగాల్పుల ముప్పు

తాను తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడినని.. గత 18 రోజులలో రాష్ట్రానికి 670 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురావడం చాలా ఆనందకరంగా ఉందని.. ఐతే కొద్దిరోజులుగా మంచిర్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు ఏ వైన్ షాప్‎లో గాని, బార్లలో గాని దొరకడం లేదని.. లేఖలో రాసుకొచ్చాడు. ఎండ తీవ్రతలు ఎక్కువ అవుతున్న కొద్దీ.. జనాలు.. ముఖ్యంగా యువకులు.. దాహం తీర్చుకునేందుకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపాడు. మంచిర్యాలలోనే కాదు.. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లోనూ కింగ్ ఫిషర్ లైట్ బీర్లు దొరకడం లేదని.. లైట్ బీర్లను తాగడం ద్వారా మత్తు తక్కువ సమయం ఉంటుందని.. ఆ తర్వాత తమ పనులను చేసుకోగలుగుతాము అంటూ వివరించాడు. స్ట్రాంగ్ బీర్లు తాగడం ద్వారా కడుపులో మంట, తీవ్రమైన తలనొప్పి, వాంతులు వంటివి వస్తున్నాయని కూడా రాసుకొచ్చాడు.

తమకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి చల్లటి కింగ్ ఫిషర్ బీర్లను జిల్లాలోని అన్ని వైన్ షాపుల్లో, బార్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోమని కోరాడు. ఇది తన ఒక్కరి ఫిర్యాదు కాదని.. లైట్ బీర్లు తాగే ప్రతి ఒక్కరి తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నానని రాశాడు. తమకు సహకరిస్తే రాష్ట్ర ఆదాయాన్ని మరింత రెట్టింపు చేసేందుకు కృషి చేస్తామని తెలిపేందుకు సంతోషిస్తున్నానని లెటర్ ఎండ్ చేశాడు. ఈ లేఖ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవడ్రా వీడు.. ఇంత టాలెంటెడా ఉన్నాడు అని కొందరు.. అమ్మో వీడెవడో తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిలా ఉన్నాడే అని మరికొందరు.. లైట్ బీర్ల కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలన్న దరిద్రమైన ఐడియా ఎలా వచ్చింది భయ్యా అంటూ ఇంకొందరు.. ఈ లేఖను వైరల్ చేస్తున్నారు.