తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ లో మూడు రోజుల పాటు కైట్ ఫెస్టి వల్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఈ ఫెస్ట్ వల్ కు ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్, థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నం, మలేషియా, ఇటలీ, తైవాస్, దక్షిణాఫ్రికా& నెదర్లాండ్ వంటి దాదాపు 16 దేశాల నుంచి 40 మంది పర్యాటకులు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది కైట్ ఫెస్టివల్ కు వచ్చారు. అంతర్జాతీయ గాలిపటాల ఆటగాళ్లు, 60 మంది జాతీయ పతంగుల క్లబ్ సభ్యులు 3 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొని వివిధ డిజైన్లతో కూడిన పతంగులను ఎగరవేయనున్నారు. కాగా సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగా.. సంక్రాంతి పండుగ గ్రామాల్లో ఈ సందడి తగ్గిపోయింది. కాగా పెద్ద, చిన్న అందరిని ఈ కలిసేందుకు.. ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయడం కోసం ఈ కైట్ ఫెస్ట్ నేడు కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.
కైట్ ఫెస్టివల్ ను వచ్చే సంవత్సరం మండల్లాలో కూడా కైట్ ఫెస్టివల్ జరుపుతామని పర్యటక మంత్రి అన్నారు. కాగా దాదాపు మూడేళ్లుగా కరోనా వల్ల కైట్ ఫెస్టివల్ జరగడం లేదు. దీంతో ఈ సారి ఈ పండుగను ప్రారంభించి వచ్చే సంవత్సరం నుంచి ప్రతి జిల్లాలో, మండలాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఆటలో పిల్లలకు ప్రముఖ్యత ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.తెలంగాణ ఆట, పాట, సంస్కృతిని ప్రపంచం అంతటా వ్యాపించే కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.