TS INTER EXAMS: ఇంటర్ పరీక్షల టైం టేబుల్ విడుదల.. ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం

తెలంగాణ విద్యా శాఖ, ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ప్రారంభం కాగా, ఫిబ్రవరి 29 నుంచి ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు ప్రారంభం అవుతాయి.

  • Written By:
  • Publish Date - December 31, 2023 / 06:41 PM IST

TS INTER EXAMS: తెలంగాణలో ఇంటర్మీడియెట్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు మూడు రోజుల క్రితం విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ విద్యా శాఖ, ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ప్రారంభం కాగా, ఫిబ్రవరి 29 నుంచి ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు ప్రారంభం అవుతాయి.
ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అంతకుముందు.. అంటే ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది తొలిసారిగా ఫస్టియర్‌ విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహించబోతుంది ఇంటర్ బోర్డు. ఈ ప్రాక్టికల్స్‌ను ఫిబ్రవరి 16న నిర్వహిస్తారు. ఇంగ్లిష్ థియరీ పరీక్షకు 80 మార్కులకు ఉండనుండగా.. ప్రాక్టికల్ పరీక్షకు 20 మార్కులు ఉంటాయి. ఫిబ్రవరి 17న ఎథిక్స్‌ అండ్ హ్యూమన్‌ వాల్యూస్‌ ఎగ్జామ్, ఫిబ్రవరి 19న ఎన్విరాన్‌మెంటల్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్ రెగ్యులర్ పరీక్షలతోపాటు, ఒకేషనల్ పరీక్షలు కూడా ఫిబ్రవరి 28న ప్రారంభం అవుతాయి. ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు, ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు జరుగుతాయి. అయితే, బ్రిడ్జ్ కోర్సు పరీక్షలు మార్చి 14, 16 తేదీలలో నిర్వహించనున్నారు. దీంతో ఇంటర్ పరీక్షలు పూర్తవుతాయి.
ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇది..

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు..
ఫిబ్రవరి 28: సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I
మార్చి 01: ఇంగ్లిష్‌ పేపర్‌-I
మార్చి 04: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IA, బాటనీ పేపర్‌-I, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-I
మార్చి 06: మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IB, జువాలజీ పేపర్‌-I, హిస్టరీ పేపర్‌-I
మార్చి 11: ఫిజిక్స్‌ పేపర్‌-I, ఎకనామిక్స్‌ పేపర్‌-I
మార్చి 13: కెమిస్ట్రీ పేపర్‌-I, కామర్స్‌ పేపర్‌-I
మార్చి 15: పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-I, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-I
మార్చి 18: మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I, జియోగ్రఫీ పేపర్‌-I

ఇంటర్‌ సెకండియర్ పరీక్షలు..
ఫిబ్రవరి 29: సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II
మార్చి 02: ఇంగ్లిష్‌ పేపర్‌-II
మార్చి 05: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IIA, బాటనీ పేపర్‌-II, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-II
మార్చి 07: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IIB, జువాలజీ పేపర్‌-II, హిస్టరీ పేపర్‌-II
మార్చి 12: ఫిజిక్స్‌ పేపర్‌-II, ఎకనామిక్స్‌ పేపర్‌-II
మార్చి 14: కెమిస్ట్రీ పేపర్‌-II, కామర్స్‌ పేపర్‌-II
మార్చి 16: పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-II, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-II
మార్చి 19: మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II, జియోగ్రఫీ పేపర్‌-II