TS INTER RESULTS: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ఒకేసారి రిలీజ్

ఇంటర్ ఫస్టియర్ లో 60.01 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్‌లో 64.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల కోసం ఇంటర్మీడియెట్ బోర్డు వెబ్‌సైట్ సంప్రదించాలి. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగాయి.

  • Written By:
  • Updated On - April 24, 2024 / 02:51 PM IST

TS INTER RESULTS: తెలంగాణ ఇంటర్ ఫలితాలు బుధవారం ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్ని ఒకేసారి విడుదల చేశారు. హైదరాబాద్, నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా కలసి ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ లో 60.01 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్‌లో 64.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో, కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో ఉంది.

PAWAN KALYAN: పవన్ కల్యాణ్ జస్ట్ టెన్త్ పాస్.. నో ట్రోల్స్ ప్లీజ్ !!

ఫలితాల కోసం ఇంటర్మీడియెట్ బోర్డు వెబ్‌సైట్ సంప్రదించాలి. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగాయి. ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9.80 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 4.78 లక్షల మంది ఫస్టియర్ స్టూడెంట్స్, 4.43 లక్షల మంది సెకండియర్ స్టూడెంట్స్ పరీక్షలు రాశారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 48,277 మంది ఫస్టియర్ ఎగ్జామ్స్, 46,542 మంది సెకండియర్ ఎగ్జామ్స్ రాశారు. ప్రస్తుతానికి ఫలితాలు మాత్రమే విడుదలకాగా.. మెమోలు మరో నాలుగైదు రోజుల్లో అందుబాటులో ఉంటాయి. గతంలో పరీక్షలు మొత్తం పూర్తయ్యాకే వాల్యుయేషన్ చేసేవాళ్లు. కానీ, ఈసారి పరీక్షలు ముగియడానికి పది రోజుల ముందే.. అంటే మార్చి 10 నుంచే వాల్యుయేషన్ స్టార్ట్ చేశారు.

అందువల్లే ఫలితాల్ని త్వరగా విడుదల చేయగలిగారు. ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కూడా రిజల్ట్స్ త్వరగా రిలీజ్ చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఈ సారి రిజల్ట్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఒకటికి మూడుసార్లు జవాబు పత్రాల్ని పరిశీలించిన తర్వాతే రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 30న తెలంగాణలో టెన్త్ ఫలితాల్ని వెల్లడించనుంది విద్యాశాఖ. ఏపీలో ఇప్పటికే పదో తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.