తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections) రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. బీఆర్ఎస్ (BRS) పార్టీలో అయితే కేసీఆర్ అన్ని తానై.. రోజుకు మూడు సభల చొప్పున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పక్క రాష్ట్రం అయిన కర్ణాటకలో నుంచి సీఎంను మంత్రులను తీసుకొని ప్రచారం చేస్తున్నారు. మారి బీజేపీకి ఏం తక్కువ.. అందుకే రాష్ట్ర స్థాయి నేతల నుంచి కేంద్ర మంత్రులు.. ప్రధాన మంతి దాకా వచ్చి తెలంగాణ లో ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే నేడు కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా ఇవాళ తెలంగాణకు రానున్నారు.
Congress Manifesto : నేడు కాంగ్రెస్ మేని ఫెస్టో విడుదల..
అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్..
ఇవాళ రాత్రి 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు అమిత్ షా.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్ కు వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం అల్పాహారం తర్వాత 10.30 గంటలకు సోమాజిగూడలోని క్షత్రియ హోటల్ కు చేరుకోనున్నారు. అనంతరం బీజేపీ ఎన్నికల మేనిఫోస్టో ను విడుదల చేయనున్నారు. అనంతరం మేనిఫెస్టోను ప్రజలకు వివరించనున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా.
మేనిఫెస్టో విడుదల అనంతరం బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో గద్వాల్ కు వెళ్లనున్నారు అమిత్ షా. మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 1.20 వరకు గద్వాల బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. 2.45 నుంచి 3.20 గంటల వరకు నల్గొండ లో సభ.. సాయంత్రం 4.10 నుంచి 4.45 గంటల వరకు వరంగల్లో నిర్వహించే సకల జనుల విజయ సంకల్ఫ సభల్లో అమిత్ షా మాట్లాడనున్నారు. తర్వాత రాత్రి 7 గంటల నుండి 7.45 వరకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో ఎమ్మార్పీఎస్ నేతలతో ఆయన భేటీ కానున్నారు ఈ భేటీ తర్వాత అమిత్ షా బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుని.. రాత్రి 8.15 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు కేంద్ర మంత్రి అమిత్ షా.