Weather Update : తెలంగాణ వెదర్ అప్డేట్.. మరో 3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఏపీలోని నెల్లూరు, ప్రకాశం, అల్లూరి, మన్యం జిల్లాలు, తెలంగాణలోని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి.

ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఏపీలోని నెల్లూరు, ప్రకాశం, అల్లూరి, మన్యం జిల్లాలు, తెలంగాణలోని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. తెలంగాణలోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.

ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 3 గంటల్లో వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంగనర్‌లో పిడుగులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. కామారెడ్డి, మెదక్, NZB, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వీటితో పాటు ADB, HYD, భద్రాద్రి, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక రాష్ట్రంలోని ఈ జిల్లాలకు కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయంది. ఆసిఫాబాద్, NZB, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, NLG, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, SRD, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

అటు ఏపీలో నేడు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని APSDMA ప్రకటించింది. కాగా నిన్న హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.