ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి… తెలంగాణా బాకీ ఉన్న నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. తెలంగాణ ఇవ్వాల్సిన 2547 కోట్ల రూపాయలను ఏపీకి చెల్లించింది కేంద్రం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోవడంతో… కేంద్రమే తెలంగాణ ఏపీకి చెల్లిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విదేశీ ఆర్థిక సహాయం తో అనేక సేవా కార్యక్రమాలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే రాష్ట్ర విడిపోయిన తర్వాత కూడా ఆ అప్పులు ఏపీనే చెల్లిస్తుంది. ప్రాజెక్టు లు మొత్తం తెలంగాణలో ఉన్న అప్పులు మాత్రం ఏపీ చెల్లిస్తుంది. దీనిపై గతంలో చంద్రబాబు సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు నివేదించినా సరే ఫలితం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ అయింది.