Telangana Governor : రేపు తెలంగాణ కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం… రేపు హైదరాబాద్ చేరుకొనున్నా జిష్ణుదేవ్ వర్మ

రేపు తెలంగాణ (Telangana) కొత్త గవర్నర్ (New Governor) గా జిష్ణుదేవ్ వర్మ (Jishnudev Verma) ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్​భవన్​ (Raj Bhavan) లో రేపు సాయంత్రం తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే (Justice Alok Aradhe) కొత్త గవర్నర్​తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

రేపు తెలంగాణ (Telangana) కొత్త గవర్నర్ (New Governor) గా జిష్ణుదేవ్ వర్మ (Jishnudev Verma) ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్​భవన్​ (Raj Bhavan) లో రేపు సాయంత్రం తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే (Justice Alok Aradhe) కొత్త గవర్నర్​తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్​కు రానున్నారు. త్రిపు (Tripura) కు చెందిన ఈయన రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం విశేషం.. త్రిపుర నుంచి గవర్నర్‌గా నియమితులైన తొలి వ్యక్తి తానేనని పేర్కొన్నారు. జిష్ణుదేవ్ వర్మ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పుకోచ్చారు.

Pavel Durov 100 Children Father : పెళ్లికాకుండా 100 మంది పిల్లల్ని కన్నాడు…

“తనకు శనివారం రాత్రి ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) ఫోన్ చేశారని తెలిపారు. ఆయన ఫోన్ చేసే వరకు తన నియామకం గురించి తెలియదన్నారు. ‘మీరు త్రిపుర వెలుపల పని చేయాల్సి ఉంటుంది’ అని తనకు ఫోన్ చేసి ప్రధాని చెప్పారని వెల్లడించారు. ఈ సంభాషణలో మీరు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా సిద్ధమేనని తాను మోదీకి తెలిపానన్నారు.” ఆ తర్వాత రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, ఆయన స్వాగతం పలుకుతూ ఫోన్ చేశారని తెలిపారు. దీంతో తాను తెలంగాణకు గవర్నర్‌గా వెళుతున్నట్లుగా అర్థమైందన్నారు. వెల్లడించారు. జిష్ణుదేవ్ వర్మ 2018-2023 మధ్య త్రిపుర ఉపముఖ్యమంత్రి (Deputy CM) గా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు జార్ఖండ్ గవర్నర్ (Jharkhand Governor) ​గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) మహారాష్ట్ర (Maharashtra) గవర్నర్​గా నియమితులయ్యారు.

Suresh SSM