చంద్రబాబు అరెస్ట్ అక్రమమైనదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. ఏ తప్పు చేయకున్నా చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక తమ ఆస్తులన్నీ బహిర్గతం చేశామని తెలిపారు. మా నాన్న డబ్బే సంపాదించాలని భావిస్తే రాజకీయాలు అవసరం లేదన్నారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించారని పేర్కొన్నారు. అలాంటి నాయకుడిపై దొంగ కేసులు పెట్టారని వివరించారు. నిరంతరం ప్రజల కోసం చంద్రబాబు పని చేశారు. ఒకసారి ప్రజలంతా ఆలోచించాలని కోరారు.
ఇవాళ చంద్రబాబు కుటుంబానికి ఇబ్బంది రావచ్చు. రేపు ప్రతి ఒక్కరి కుటుంబానికి ఇదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. సైకో జగన్ ఆలోచలు ఇదే విధంగా ఉంటాయని విమర్షించారు. టీడీపీ-జనసేన పోరాడకుంటే రాష్ట్రం ముక్కలు చేసి అమ్మేసేవాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం పోరాడినందుకే చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు. టీడీపీ-జనసేన కలిస్తే 160 స్థానాలు ఖాయమని జోస్యం చెప్పారు. ఈ నెల 25వ తేదీ నుంచి నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి పర్యటనలు చేపడతారని వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా అక్టోబర్ 24వ తేదీన తిరుమల వెంకన్న దర్శనం చేసుకోనున్నట్లు వెల్లడించారు.
T.V.SRIKAR