చంద్రబాబు అరెస్ట్ తో అటు టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. మన్న రోజాపై మాజీమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. బండారును అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ తరుణంలో అనిత ప్రెస్ మీట్ పెట్టి రోజా, పద్మలపై మాట్లాడారు.
బండారు సత్యనారాయణ అరెస్ట్ చేసిన విధానాన్ని ఖంచించారు. వైసీపీ మంత్రి ఆర్కే రోజాకు తెలుగుదేశం పార్టీ మహిళా నేత వంగలపూడి అనిత ఛాలెంజ్ విసిరారు. కేజీహెచ్ కు వస్తే కల్తీ మద్యం తాగి జీవశ్చవాలుగా మారిన బాధితులను కళ్ళ ముందు చూపిస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో నాపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే కంప్లైంట్ అస్సలు తీసుకోవడంలేదని ఆరోపించారు. రోజా ఏడుపులు మహానటి ఏడుపులు అని ఎద్దేవా చేశారు. గ్లిజరిన్ పూసుకుని ఏడుస్తున్నారని విమర్శించారు. మహిళ గురించి అయితే సంస్కారంగా మాట్లాడొచ్చని.. కానీ రోజా మహిళ కాని మహిళ అంటూ ఘాటుగా స్పందించారు. ఈ అంశం బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడిన మాటలను మరోసారి గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే రాష్ట్రంలో రోజా ఏడుపులపై ఎవరూ స్పందించలేదని వ్యాఖ్యానించారు.
గతంలో మా పాలనలో మంచి మద్యం విక్రయిస్తున్న సందర్భంలో అప్పటి ప్రతిపక్షంలో ఉన్న రోజా, వాసిరెడ్డి పద్మలు స్పందించారు. వైన్ షాపుల ముందు మద్యం సీసాలను పగులగొట్టారు. కానీ ఇప్పుడు కల్తీ మద్యం విషయంలో ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడే సంప్రదాయానికి తెరలేపిందే రోజా అంటూ కొన్ని వీడియోలను చూపించారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గురించి గతంలో చేసిన మాటలను మీడియాకు చూపించే ప్రయత్నం చేశారు. దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.