Amazon, Forest Dolphin Dies : అమెజాన్ లో అంతుచిక్కని డాల్ఫిన్ మరణాలు..?

అమెజాన్ నది లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెజాన్ నదిలో చాలా జలచరాలు నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతున్నాయి. నదిలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో నీరు చాలా త్వరగా వేడెక్కి ఈ ప్రభావం ఆ నదిలో ఉండే జలచరాలు అయిన అరుదైన పింక్ డాల్ఫిన్ పై పడుతుంది. ఈ విపరీతమైన వాతావరణ మార్పుల నది నీటి ప్రవాహం లేక నీటిలో ఉన్న ఆక్సిజన్ శాతం తగ్గి జంతువులు మరణిస్తున్నాయి. గత వారం రోజులుగా 120 పింక్ డాల్ఫిన్లు మృత్యువాత చెందాయి.

అమెజాన్ బహుశా ఈ పేరు తెలియని వారు ఉండరేమో.. ఉండరు కూడా.. ఎందుకంటే ఆ పేరుకు అంత చరిత్ర ఉంది మరీ. అమెజాన్ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన అడవి.. ఒక్క సారి ఈ అడవిలో మనుషులు తప్పిపోతే వారిని కనుక్కోవడం అనే మాట పక్కపేడదం కానీసం వారి అచూకి.. శవం అయిన దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి.. ఒక్క మాటలో చెప్పాలంటే అమెజాన్ అడవిలో సూర్య కిరణాలు భూమిని తాకలేవంటారు.. అంటే అంత ఎత్తైన చెట్లు.. దంట్టంగా అలుముకోని ఉంటాయి అన్నమాట. ఈ భూమండలానికి అమెజాన్ అడవి 20% ఆక్సిజన్ విడుదల చేస్తుంది. భూమండలానికి అమెజాన్ ఊపిరితిత్తుల వంటివి అని మనం చిన్నప్పటి నుండి చదువుతూనే ఉన్నాం.. మరీ అంత పెద్ద ఈ అడవి.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే.. అక్కడికే వస్తున్నా.. అమెజాన ఎంత భయకంరమైన అడవి అయిన అందులో చాలా అద్భుతాలు.. చాలా అరుదైన జతు జాలం కూడా చాలానే ఉంది.. అందులో ఓ జంతువు గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. కొన్ని రోజులుగా ఇక్కడ నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల పైమాటే. అంటే 100 నుంచి 102 ఫారెన్‌హీట్‌గా అక్కడి టెంపరేచర్ పెరుగుతుపోతుంది. ఈ అడవీ నుంచి ఓ పెద్ద అంతుచిక్కని నది కూడా ఉంది అదే అమెజాన నది. ప్రపంచ అనే ఉండే అరుదైన జల సంపద, జంతుజాలం ఈ నదిలో పుష్కలంగా లభిస్తుంది. అంటే నమ్మండి. కానీ ఇప్పుడు ఆ నదిలో ఓ విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అవే చాలా అరుదైన పింక్ డాల్ఫిన్ . గత వారం రోజులుగా ఈ నదిలో నుంచి పదుల సంఖ్యలో డాల్ఫిన్లు చనిపోతున్నాయి. రోజురోజుకు వాటి మృతుల సంఖ్య పెరిగిపోతుంది.

అమెజాన్ నదిలో డాల్ఫిన్ లు ఎందుకు మృత్యువాత పడుతున్నాయి..?

అమెజాన్ నది లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెజాన్ నదిలో చాలా జలచరాలు నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతున్నాయి. నదిలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో నీరు చాలా త్వరగా వేడెక్కి ఈ ప్రభావం ఆ నదిలో ఉండే జలచరాలు అయిన అరుదైన పింక్ డాల్ఫిన్ పై పడుతుంది. ఈ విపరీతమైన వాతావరణ మార్పుల నది నీటి ప్రవాహం లేక నీటిలో ఉన్న ఆక్సిజన్ శాతం తగ్గి జంతువులు మరణిస్తున్నాయి. గత వారం రోజులుగా 120 పింక్ డాల్ఫిన్లు మృత్యువాత చెందాయి.

అమెజాన నదిలో నీటి కొరత.. ?

అమెజాన్ నది ఈ నది అమెజాన అడవి గుండా కొన్ని పాము వలే కొన్ని వేళ ఒంపులు తీరుగుతు ప్రవహిస్తుంది. ఈ నదిలో అమెజాన్ అడవిలో ఉన్న చాలా సరస్సులు.. చిన్న పాటివాగులు.. జలపాతాలు ఇలా వేల సంఖ్యలో ఉన్న నీటి ప్రవాహాలు అన్ని కూడా ఈ నదిలో కలుస్తాయి.. అయిన కూడా ఈ నదిలో నీటి తగ్గుదల క్రమేపి జరుగుతుంది. దీనికి తోడు వర్షంపాత్రం తక్కువ కావటం వల్ల అమెజాన్ నదీ తీరం చాలావరకు ఎండిపోయింది సైంటిస్ట్ బృందం స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రభావం కూడా ఈ డాల్ఫిన్ మరణాలకు ఓ కారణం అని శాస్త్రవేత్తలు చెప్పతున్నారు. ఈ వర్షాభావ పరిస్థితుల బ్రెజిల్‌లోని అమెజాన్ లోని అడవీ ప్రాంతాల్లో కరవు ఛాయలు చాలా స్పష్టంగా కనిపించాయి. అంతేకాదు దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 59 మున్సిపాలిటీల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. ఈ పరిస్థితి నదిపై నీటి రవాణా, అలాగే చేపల వేట వంటి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో బ్రెజిల్ లో మత్స్య సంపద స్తంభించిపోయింది. ఈ ప్రభావం మత్స్య వ్యాపారం పడింది.

ఈ పింక్ డాల్ఫిన్లు చాలా అరుదైనదిగా గుర్తింపు..

అమెజాన్ నది డాల్ఫిన్లు, చాలా అద్భుతమైన గులాబీ రంగులో ఉంటాయి. ఇవి దక్షిణ అమెరికాలోని నదులలో మాత్రమే కనిపించే ప్రత్యేకమైన మంచినీటి జాతులు. ప్రస్తుతం ఈ జాతులు కూడా అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి. ప్రపంచంలో ఇంకా మిగిలి ఉన్న కొన్ని మంచినీటి డాల్ఫిన్ జాతులలో ఈ పింక్ జాతి కూడా ఒకటి. నెమ్మదిగా వాతావరణ మార్పుల వల్ల పునరుత్పత్తి వ్యవస్థ ఈ డాల్ఫిన్ లో దెబ్బతింటుందని జల నిపుణులు చెప్తున్నారు. క్రమేపీ వీటి మనుగడ సంఖ్య చాలా క్షీణించింది వాటి ఈ వారంలో 120 డాల్ఫిన్ల్ మృతి చెందాయని స్పష్టం చేసింది.

డాల్ఫిన్ మరణం మరో కారణం..

డాల్ఫిన్ మరణాల పెరుగుదలకు కరువు, వేడి కారణమని శాస్త్రవేత్తలు ఖచ్చితంగా చెప్పడం లేదు.. డాల్ఫిన్ మరణం పై మరో కోణం వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు..అది ఏమిటి అంటే.. అమెజాన్ ఉపనది అయిన టెఫే నది ద్వారా ఏర్పాటిన ఓ సరస్సు లో డాల్ఫిన్లు ఉంటాయి. ఆ డాల్ఫిన్ పై అతి భయంకరమైన బ్యాక్టీరియా డాల్ఫిన్ ను అంటిపెట్టుకొని ఉంటాయి. ఆ డాల్ఫిన్లకు ఆ బ్యాక్టీరియా సంక్రమించి జీవరాశులు మరణానికి దారి తీస్తుంది. ఈ పింక్ డాల్ఫిన్ కూడా ఆ బ్యాక్టీరియా సంక్రమించే ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేతలు. అందులోనూ టెఫే సరస్సు యొక్క నీటి ఉష్ణోగ్రత గురువారం సూమారుగా 39 డిగ్రీల సెల్సియస్ (102 డిగ్రీల ఫారెన్‌హీట్) కి చేరింది. దీంతో గురువారం ఒక్కరోజే దాదాపు 70 మృతదేహాలు బయటపడ్డాయి. ఇది ప్రతి సంవత్సరంలో.. ఈ సమయంలో సగటు 10 డిగ్రీల కంటే ఎక్కువ అని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరుసటి రోజు సరస్సు నీరు చల్లబడిన ఆదివారం ఒక్కసారిగా నీటి ఉష్ణోగ్రత 37 C (99 F) కు పెరిగింది.దీంతో జలవనరుల నిపుణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అమెజాన్ నది నుంచి కుళ్లిపోయిన డాల్ఫిన్ మృతదేహాలను నిపుణులు నది నుండి వెలికితీ తీస్తున్నారు. కుళ్ళిపోతున్న డాల్ఫిన్‌ల దుర్గంధం మధ్య, జీవశాస్త్రవేత్తలు శాస్త్రవేత్తల అనుమాణంతో వీటి మరణానికి కారణాన్ని గుర్తించడానికి మృతదేహాలకు పోస్టు మార్టన్ నిర్వహిస్తున్నారు.

డాల్ఫిన్ మరణాలపై డాక్యుమెంట్.. అరుదైన పింక్ డాల్ఫిన్ ..

ప్రతి 10 మృతదేహాలలో దాదాపు ఎనిమిది పింక్ డాల్ఫిన్‌లు ఉన్నాయి. వాటిని బ్రెజిల్‌లో “బోటోస్” అని పిలుస్తారు, ఇది లేక్ టెఫేలో వారి అంచనా జనాభాలో 10% ప్రాతినిధ్యం వహిస్తుందని నిపుణులు చేస్తున్నారు. బోటో, గ్రే రివర్ డాల్ఫిన్‌లు “టుకుక్సీ” అని పిలువబడతున్నాయి. “మేము గత వారంలో 120 మృతదేహాలను డాక్యుమెంట్ చేసాము” అని మామిరావా పర్యావరణ సంస్థలో పరిశోధకురాలు మార్మోంటెల్ చెప్పారు, ఇది మధ్య-సోలిమోస్ నది పరీవాహక ప్రాంతంపై ఎక్కువ దృష్టి సాదించింది ఈ డాల్ఫిన్ డాక్యుమెంట్. బ్రెజిల్‌లోని చికో మెండెస్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ సరస్సులో ఇప్పటికీ సజీవంగా ఉన్న డాల్ఫిన్‌లను రక్షించడానికి పశువైద్యులు, జల క్షీరద నిపుణులను పంపించారు. పరిశోధకులు మరణాలకు బ్యాక్టీరియలాజికల్ కారణాన్ని తోసిపుచ్చే వరకు వాటిని చల్లటి నదీ జలాలకు తరలించాలని తెలిపారు.

S.SURESH