దేశంలోని పలు రాష్ట్రాల్లో భానుడు భగ్గు మనిపిస్తుండుగా.. దక్షిణా భారత దేశంలో అందులోను తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎండలు కాస్తున్నాయి. ఉదయం 10 నుంచి బానుడి ప్రతాపం చూపిస్తుండుగా..
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు..
ఏపీ (AP) లో రానున్న 3 రోజులు పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరి అధిక ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదు కానున్నాయని వాతావరణశాఖ (Department of Meteorology) పేర్కొంది.ఈక నేడు 195 మండలాల్లో తీవ్ర వడగాలులు, 147 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. అటు ఏపీలోనూ మరో 4, 5 రోజులు ఎండలు, వడగాలులు కొనసాగుతాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీంతో అధికారులు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేశారు.
తెలంగాణలో మరో మూడు రోజులు జాగ్రత్త!
మరోవైపు తెలంగాణలో కూడా ఎండల తీవ్రత ఎక్కువగానే ఉందనుందని ప్రకటించింది. రెండు రాష్ట్రల్లోని పలు జిల్లాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మూడు రోజులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణశాఖ ప్రజలను సూచిస్తుంది. బుధవారం, గురువారం 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
రాజస్థాన్ లో వడదెబ్బతో ముగ్గురి మృతి..
నేడు రాజస్థాన్లో అత్యధికంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తరువాత ఢిల్లీలో 48 డిగ్రీలు, నాగపూర్లో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు IMD తెలిపింది.
రాజస్థాన్లో ఎండలు మండుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. జైపూర్లో మంగళవారం హీట్ స్ట్రోక్ కారణంగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం నాటికి మొత్తం హీట్ స్ట్రోక్ కేసుల సంఖ్య 3,965కి చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. మరణించిన వారు ఆగ్రా, ఢిల్లీకి చెందిన వారని అధికారులు తెలిపారు.