కేసీఆర్ (KCR) అంటేనే మాటలు. తిమ్మిని బమ్మిని చేయగలిగే మాటల ప్రవాహం. తెలంగాణ ఉద్యమం నడిచిందే కేసీఆర్ మాటలతోనీ. అబద్దాన్ని నిజమని నమ్మించగలిగే సత్తా.. ఏ మాట చెప్పి అయినా మాయ చేయగలిగే నేర్పరి కేసీఆర్. తెలంగాణ (Telangana) ఏర్పడితే ఎస్సీ ని తొలి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఈరోజుకి మాట నిలబెట్టుకోకపోయినా తన మాటలతో జనాన్ని బోల్తా కొట్టించారు కేసీఆర్. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా అవాకులు చవాకులు పేలిన వాటన్నిటికీ తన మాటలతోనే సమాధానం చెప్పగలిగే అసలు సిసలైన పొలిటికల్ లీడర్ కేసీఆర్. అలాంటి కేసీఆర్ ఇప్పుడు ఎందుకో చప్పబడిపోయాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రసంగాలు నిస్సత్తువుగా సాగుతున్నాయి. కెసిఆర్ స్పీచ్ లో ఇంతకుముందు ఉన్నంత జోరు హోరు కనిపించడం లేదు. ఆంధ్ర వాళ్ళని తిట్టిపోయడానికి, రాజకీయ ప్రత్యర్ధుల్ని చెడుగుడు ఆడడానికి సర్రు మని లేచే ఆయన నాలుక ఇప్పుడు ఎందుకో తడబడిపోతుంది.
NTR : ఇటుక ఇటుకలో ఎన్టీఆర్.. నీ అభిమానం సల్లగుండ..
తెలంగాణ సాధించి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి పదేళ్లు అయిపోతుంది. దాంతో అభివృద్ధి గురించి తప్ప.. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తే జనం నమ్మరు. చేసింది చెప్పాలి కానీ పక్కవాడిని దుమ్మెత్తి పోస్తే నవ్వుకుంటారు కూడా. కానీ కేసీఆర్ మాత్రం మళ్లీ అవే మాటలు, పాత తూటాలు పేలుస్తున్నారు. తానే తెలంగాణ తెచ్చానని, తెలంగాణ కోసం పక్షి లా తిరిగానని, తాను ఇన్ని పోరాటాలు చేశానని, అన్ని పోరాటాలు చేశానని.. మృత్యుని ముద్దాడి వచ్చానని అరిగిపోయిన రికార్డ్ని మళ్లీ మళ్లీ వేస్తున్నాడు . ఈ మాటలన్నీ 20 ఏళ్లుగా అందరూ విన్నవే. కేసీఆర్ కొత్తగా ఏం మాట్లాడుతాడా అని ఎదురుచూస్తున్నారు. కానీ కెసిఆర్ స్పీచ్ లో ఒకప్పటి వాడి వేడి, ఛలోక్తులు.. విమర్శలు సంచలనాలు ఏమీ లేవు. పైగా ప్రధాని నరేంద్ర మోడీపై.. బీజేపీపై ఆయన ఒక అప్పట్లో.. నిప్పులు కురిపించేవారు. మాటలతో చండాడే వాడు. కానీ ఇప్పుడు బిజెపి వాళ్లని మాట వరసకు కూడా విమర్శించడం లేదు. కేవలం కాంగ్రెస్ నీ మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు.
Wine Shops Bandh : ఈసీ కీలక నిర్ణయం.. తెలంగాణలో 3 రోజులు వైన్ షాపులు బంద్..!
కాలేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కుంగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన …దానిపై ఒక్క మాట కూడా కేసీఆర్ ఇప్పటివరకు మాట్లాడలేదు. సత్తెనపల్లి (Sattenapally) వెళ్లి ఆంధ్ర లో రోడ్ల గురించి వ్యాఖ్యానించారు కొంత వివాదం రేపిన మిగిలిన ఏ సభలోను కేసీఆర్ తన పాత జోష్ తో మాట్లాడిన దాఖలాలు లేవు. బహుశా 10 ఏళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి గురించి చెప్పుకోవాలి తప్ప ప్రతిపక్షాలను విమర్శించడం వల్ల జనం నమ్మరని గ్రహించారు ఏమో ఆయన మాటల్లో ఎక్కడ వాడి కనిపించడం లేదు. పైగా నన్ను ఓడిస్తే వెళ్లి రెస్ట్ తీసుకుంటా, తెలంగాణని మీరే కాపాడుకోవాలి. ఇలాంటి చౌకబారు బెదిరింపులు మినహా నిర్మాణాత్మక విమర్శలు ఏమీ లేవు. కేటీఆర్, హరీష్ రావులు కూడా పదే పదే తెలంగాణ (Telangana) ని ఏపీతో పోలుస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప ఘనంగా మాట్లాడింది ఎక్కడ లేదు. పోలింగ్ దగ్గర పడే కొద్ది కేసీఆర్ మాటల్లో దూకుడు ఏమైనా పెరుగుతుందేమో చూడాలి.