Bomb Threat : దేశ రాజధానిలో టెన్షన్ టెన్షన్.. ఢిల్లీలో 12 స్కూళ్లకు బాంబు బెదిరింపు..

దేశ రాజధాని ఢిల్లీలో టెన్షన్ టెన్షన్ వాతావరణ నెలకొంది. ఢిల్లీలోని పలు స్కూళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

 

దేశ రాజధాని ఢిల్లీలో టెన్షన్ టెన్షన్ వాతావరణ నెలకొంది. ఢిల్లీలోని పలు స్కూళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (National Capital Region), (NCR) పరిధిలోని దాదాపు 100 స్కూళ్లకు ఇలా బెదిరింపులు వచ్చాయట. యాజమాన్యాలకు ఈ-మెయిల్స్ పంపి దుండగులు బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.. పోలీసులు స్కూళ్ల వద్దకు చేరుకుని ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు విద్యార్థులను ఇళ్లకు పంపించారు. మరి కొన్ని పాఠశాలల యాజమాన్యాలు సెలవు ప్రకటించి విద్యార్థులను ఇళ్లకు పంపించాయి.

ఢిల్లీలోని ద్వారక (Dwarka) లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (Delhi Public School), మయూర్ విహార్లోని మదర్ మేరీస్, చాణక్యపురిలోని సంస్కృతి స్కూల్‌, సాకేత్‌లోని అమిటీ, వసంతకుంజ్‌ల్లోని దిల్లీ పబ్లిక్‌ స్కూళ్లకు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్, అగ్నిమాపక యంత్రాలతో పోలీసులు స్కూళ్ల వద్దకు చేరుకున్నారు. బాంబు స్క్వాడ్ (Bomb Squad) విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు తమకు బాంబు పెట్టినట్లు ఆనవాళ్లు ఏం కనిపించలేదని పోలీసులు తెలిపారు. 12 స్కూళ్లకు పంపించిన మెయిల్స్.. మరికొన్ని పాఠశాలలకు కూడా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

SSM