ASSEMBLY ELECTIONS: పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత.. పరస్పర దాడులు.. డబ్బులు ఇవ్వలేదని ఓటు వేయని గ్రామస్తులు

జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 245 పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, సిపిఐ, బీజేపీ నేతల మధ్య గొడవ జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద అధిక సంఖ్యలో ఉండడంపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Written By:
  • Publish Date - November 30, 2023 / 11:27 AM IST

ASSEMBLY ELECTIONS: తెలంగాణ ఎన్నికల్లో పలు చోట్ల ఉద్రిక్తత తలెత్తింది. పార్టీల కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. జనగామ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 245 పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, సిపిఐ, బీజేపీ నేతల మధ్య గొడవ జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద అధిక సంఖ్యలో ఉండడంపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Celebrities Votes: లైన్లో నిల్చొని ఓట్లేసిన పొలిటికల్, సినిమా సెలబ్రిటీలు

పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్ పట్టణంలో ఉద్రిక్తత తలెత్తింది. విజయమేరి పొలింగ్ స్టేషన్ దగ్గర కాంగ్రెస్‌- బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో లాఠీఛార్జ్ చేసి, ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఖానాపూర్‌లో అన్నిపార్టీల కార్యకర్తలు గుంపులుగా ఉండడంతో పోలీసులు చెదరగొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవారిని పోలింగ్‌ కేంద్రం నుంచి తరిమేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఘర్షణ వాతావరణం కనిపించింది. కాషాయ కండువాలతో కొందరు యువకులు ఓటు వేసేందుకు ప్రయత్నించారు. పార్టీ కండువాలు లేకుండా ఓటు వేయాలని పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయంలో పోలీసులకు, ఓటర్లు వాగ్వాదానికి దిగారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

పొలింగ్ బూత్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్‌ఎస్‌ నేతల దాడి చేశారని ఆరోపించారు. దీంతో పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పంపించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. లింగంపేట మండలం షట్పల్లి సంగారెడ్డి గ్రామంలో పోలింగ్ కేంద్రం సమీపంలో అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడారు. అక్కడికి చేరుకున్న పోలీసులు లాఠీచార్జ్‌ చేసి, కార్యకర్తలందరినీ చెదరగొట్టారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఉప్పేడు వీరాపురం,