Bihar Real Power Star : పదవంటే ఆశ లేనివాడే నిజమైన రాజు.. చిరాగ్‌.. బిహార్‌ రియల్‌ పవర్‌ స్టార్‌..

ఏపీ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) క్రియేట్‌ చేసిన సెన్సేషన్‌ అంతా ఇంతా కాదు. ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు.. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ వదిలేశాడు అనే విమర్శించే ప్రత్యర్థులకు 100కు 100 శాతం స్ట్రైక్‌ రేట్‌తో దిమ్మ తిరిగే ఆన్సర్‌ చెప్పారు.

 

 

ఏపీ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) క్రియేట్‌ చేసిన సెన్సేషన్‌ అంతా ఇంతా కాదు. ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు.. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ వదిలేశాడు అనే విమర్శించే ప్రత్యర్థులకు 100కు 100 శాతం స్ట్రైక్‌ రేట్‌తో దిమ్మ తిరిగే ఆన్సర్‌ చెప్పారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి చేసిన శపథాన్ని నిజం చేశారు. ఏపీలో కూటమి గెలుపులో ఎవరు అవునన్నా కాదన్నా పవన్‌ కళ్యాణే కీలకం. ఇది అంతా ఒప్పుకోవాల్సిన సత్యం. ఈ గెలుపుతో కేంద్రలో కూడా పవన్‌ కళ్యాణ్‌ మంచి గ్రిప్‌ సాధించారు.

ఇప్పుడు అదే స్థాయి గెలుపుతో ఇండియా వైడ్‌గా తానేంటో ప్రూవ్‌ చేసుకున్నారు బిహార్‌ నేత చిరాగ్‌ పాశ్వాన్‌. ఎల్జీపీ నేత రాం విలాస్‌ పాశ్వాన్‌ (Vilas Paswan) కొడుకే ఈ చిరాగ్‌ పాశ్వాన్‌. ఎన్డీఏ కూటమిలో ఓ పార్టీగా ఉన్న LJPకి బిహార్‌లో 6 సీట్లు కేటాయించింది బీజేపీ (BJP). కూటమి ఇచ్చిన ఆరు సీట్లలో గెలిచి..100 శాతం స్ట్రైక్‌ రేట్‌తో బిహార్‌ పవర్‌ స్టార్‌ అనిపించుకున్నారు చిరాగ్‌. ఇక్కడ అన్నికంటే హైలెట్‌ పాయింట్ ఏంటి అంటే.. అంతటి అరుదైన విజయం సాధించి కూడా చిరాగ్‌ కేంద్రంలో పదవి ఆశించలేదు. తనకు కానీ తన ఎంపీలకు కానీ మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేయలేదు. జస్ట్‌.. మోడీ ప్రధానిగా ఉంటే చాలు అంటే ఎన్డీఏ మీటింగ్‌లో ఆయన ఇచ్చిన స్పీచ్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

ఒకరిద్దరు ఎంపీలుగా గెలిచిన చాలా మంది పార్టీలు నేతలు కేంద్రంలో మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. అలాంటిది ఏకంగా ఆరుగురు ఎంపీలు ఉండి కూడా పదవి ఆశించుకుండా మోడీ దగ్గర తన నిబద్ధత చూపించుకున్నారు చిరాగ్‌. చిరాగ్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో LJP నుంచే కాకుండా ఇండియా వైడ్‌గా బీజేపీ నుంచి కూడా చిరాగ్‌కు అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి.