Uttarakhand : ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సొరంగం..

దేవ్ భూమి (Dev Bhoomi) అయిన ఉత్తరాఖండ్ లో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం చార్ ధామ్ లో ఒకటి అయిన యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యరా నుంచి దండల్ గావ్ వరకు నిర్మిస్తున్న సొరంగం కూలిపోయింది.

దేవ్ భూమి (Dev Bhoomi) అయిన ఉత్తరాఖండ్ లో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం చార్ ధామ్ లో ఒకటి అయిన యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యరా నుంచి దండల్ గావ్ వరకు నిర్మిస్తున్న సొరంగం కూలిపోయింది. ఇక ఈ ప్రమాదంలో సొరంగంలో కొందరు కార్మికులు చిక్కుకుపోయారు. చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి జిల్లా యంత్రాంగం ఎస్ డి ఆర్ ఎఫ్ రెస్క్యూ టీమ్ రంగంలోకి దింపారు.

ఈ ఘటన శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ వార్త అలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూలిన సొరంగం లో దాదాపు 40 మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు సమాచారం. శిధిలాలు సిల్క్యారా వైపు 200 మీటర్ల ముందుకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా అందులో పనిచేస్తున్న కూలీలంతా 800 మీటర్ల దూరంలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు పైపుల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు ఎస్ డి ఆర్ ఎఫ్ రెస్క్యూ సిబ్బంది. ప్రస్తుతం, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

గతంలో కూడా 2021లో ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఇదే తరహాలో నిర్మారణంలో ఉన్న తపోవన్ సొరంగంలో కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు రోజులు పట్టాయి. జేసీబీలతో పాటు డంపర్ లను మోహరించిన ఫలితం లేదు.. ఇక కొత్త యంత్రాలతో డ్రిల్ చేసి రక్షించే లోపే.. సుమారుగా 53 మంది కూలీలు మృతి చెందారు.