తెలంగాణ రెండో అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. దాదాపు 10దేళ్ల తర్వాత అధికారం పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి విజయవంతంగా మొదటి అసెంబ్లీ సమావేశాలు జరిపాయి. కాగా రెండో అసెంబ్లీ సమావేశాలు జరిపేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం తేదీలను విడుదల చేసింది. ఈనెల 23న, శాసనమండలి సమావేశాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ రాధాకృష్ణన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 23న కేంద్రం ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారమణం చే రెండో సారి పార్లమెంటులో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో దానికి తగ్గట్లుగా ఈనెల 25న రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 6 గ్యారంటీల అమలు, జాబ్ క్యాలెండర్, రుణమాఫీ తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. కాగా మరో వైపు ఈ సారైన తెలంగాణ తొలి మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హజర్ అవుతారా.. లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా?
ఈనెల 23నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో BRS అధినేత కేసీఆర్ సభకు హాజరవుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రమే ఆయన స్పీకర్ ఛాంబర్ లోకి వచ్చారు. అంటే బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఒక్కసారి కూడా అసెంబ్లీలో తనకు కేటాయించిన స్థానంలో కూర్చోలేదు మాజీ సీఎం కేసీఆర్.. ఆ తర్వాత రెండుసార్లు సభ జరిగినా గులాబీ దళపతి జాడ లేదు. ఇప్పుడు తమ నేతలు వరుసగా చేజారిపోతున్న నేపథ్యంలో పార్టీని కాపాడుకునేందుకైనా సభలో అడుగుపెడతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఈసారి అసెంబ్లీలో తన ప్రతాపం చూస్తారాని.. చెప్పారు.. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఎప్పుడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైవుతాయా.. ఎప్పుడు కేసీఆర్ ను సభలో చూస్తారా అని తెగ ట్రెండ్ అయ్యింది. కాగా ఇప్పుడు సభలో అడుగు పెడతాడా.. లేదా అనేది ఈ నెల 23 వరకు వేచిచూడక తప్పదు.