ఎట్టకేలకు తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగిసిన. మొన్నా తెలంగాణ 10వ ఆవిర్భావ దినోత్సవం కూడా అగంరంగ వైభవంగా జరుపుకుంది. కాగా తెలంగాణ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో వర్షాకాల సమావేశాలు వచ్చే నెల జూలై రెండో వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల కేంద్రంలో కొలువు దీరిన ఎన్డీఏ ప్రభుత్వం జూలై మొదటి వారంలో దేశ ఆర్థిక బర్జెట్ ను ప్రవేశ పట్టనుంది. ఇది వరకే ఎన్నికల బడ్జెట్/ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. ఆ బర్జెట్ కేవలం జూలై వరకు మాత్రమే సరిపోయే విధంగా.. బడ్జెట్ ను రాష్ట్రాలకు విడుదల చేసింది గత ఎన్టీఏ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. తాజా కొత్త ప్రభుత్వం ముందుగా కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ను జులై తొలి వారంలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.. ఈ నేపథ్యంలో అందులో రాష్ట్రానికి వచ్చే కేటాయింపులను చూసుకొని దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారని తెలంగాణ సర్కర్ అధికారుల చెబుతున్నారు.