TG BHARATH: కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్.. లోకేశ్‌కి షాకిచ్చిన TG భరత్

ఏపీలో కొందరు టీడీపీ అభ్యర్థులు తారక్ ఫోటోలు వాడుకుంటున్నారు. కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా జూనియర్ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. కర్నూలు నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి టీజీ భరత్.. జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - April 26, 2024 / 05:08 PM IST

TG BHARATH: ఏపీ ఎన్నికల్లో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు మార్మోగుతోంది. గతంలో టీడీపీకి ప్రచారం చేసిన జూనియర్.. ఈ మధ్యకాలంలో చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్‌తో పాటు టీడీపీ వ్యవహారాలతో అంటీముట్టనట్టుగా ఉంటున్నాడు. వాళ్ళతో ఉన్న విభేదాలతో ఈ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చే పరిస్థితే కూడా లేదు. కానీ ఏపీలో కొందరు టీడీపీ అభ్యర్థులు తారక్ ఫోటోలు వాడుకుంటున్నారు.

TELANGANA NOMINATIONS: పార్లమెంట్ బరిలో ఎంతమంది..? ఈ నియోజకవర్గంలోనే 114 మంది పోటీ

కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా జూనియర్ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. కర్నూలు నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి టీజీ భరత్.. జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఫ్లెక్సీల్లోనే కాదు.. జూనియర్ ఫోటోలు పట్టుకొని జనానికి చూపిస్తూ ఓట్లు అడుగుతున్నాడు. సీనియర్ నేత టీజీ వెంకటేశ్ కొడుకే భరత్. ఈయన లోకేశ్‌కి అత్యంత సన్నిహితుడు కూడా. అయినప్పటికీ.. రాబోయే కాలానికి కాబోయే సీఎం అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తెగ వాడేస్తున్నాడు. లోకేశ్ దగ్గర వ్యక్తి అయిన భరత్.. ఎన్టీఆర్ కాబోయే సీఎం అని ఫ్లెక్సీ పెట్టడమేంటని జనం ఆశ్చర్యపోతున్నారు. ఈ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్‌ని వాడేసుకుంటే గెలుపు గ్యారంటీ అని భరత్ అనుకున్నాడేమో.

మరి ఈ విషయం చంద్రబాబు, బాలయ్య, లోకేశ్‌కి తెలిసే జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఫొటోని ఒక్క భరత్ మాత్రమే కాకుండా గుడివాడ వైసీపీ నేత కొడాలి నాని కూడా వాడుకుంటున్నారు. మొన్నటి నామినేషన్ ర్యాలీలో తారక్ ఫోటోలు ప్రదర్శించారు. కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోలను వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. నాని వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడన్న టాక్ నడుస్తోంది. మరి భరత్ కూడా తారక్ పర్మిషన్ తీసుకునే ఆయన ఫోటో వాడుతున్నారా.. సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చారా అన్నది తెలియాల్సి ఉంది.