Thank you Dravid : థ్యాంక్యూ ద్రవిడ్‌.. నీకు రుణం అయితమయ్యా!

థ్యాంక్యూ ద్రవిడ్‌.. నీకు రుణం అయితమయ్యా! ఇది ఇప్పుడు మిస్టర్ వాల్ గురించి అభిమానులు చెప్పుకుంటున్న మాట. 13ఏళ్ల కింద 2011లో టీమిండియా వాల్డ్‌కప్ నెగ్గింది.

 

 

థ్యాంక్యూ ద్రవిడ్‌.. నీకు రుణం అయితమయ్యా! ఇది ఇప్పుడు మిస్టర్ వాల్ గురించి అభిమానులు చెప్పుకుంటున్న మాట. 13ఏళ్ల కింద 2011లో టీమిండియా వాల్డ్‌కప్ నెగ్గింది. ఆ తర్వాత ప్రతీసారి నిరాశే ! సెమీఫైనల్‌, ఫైనల్ వరకు వెళ్లడం.. ఓటమితో తిరిగిరావడం.. మళ్లీ నాకౌట్‌ ఫోబియా వచ్చిందా మనోళ్లకు అని ఆవేదనతో… తమలో తామే రగిలిపోతున్న అభిమానుల్లో కొత్త జోష్‌ నింపాడు ద్రవిడ్‌. కోచ్‌గా జట్టును ముందుండి నడిపించి.. భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు.

దీంతో రుణం అయితం ద్రవిడ్ అంటూ ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నారు. భారత కెప్టెన్‌గా 2007 వాల్డ్‌కప్‌లో ఘోర పరాభవాన్ని చూసిన ద్రవిడ్‌.. కోచ్‌గా మాత్రం జట్టును సక్సెస్‌బాటలో నడిపించాడు. సుదీర్ఘ కాలం భారత్‌కు ఆడినా… అతడి ఖాతాలో ఒక్క వాల్డ్‌కప్ కూడా లేదు. ఐతే అప్పుడు కలగానే మిగిలిన కప్‌ను.. తన అపార అనుభవంతో జట్టు కోచ్‌గా ద్రవిడ్‌ సాధించి చూపాడు. ఈ వాల్డ్‌కప్‌కు ముందే.. అండర్‌19 జట్టుు కూడా కప్ అందించాడు. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్నప్పుడు 2021 టీ20 వాల్డ్‌కప్‌లో గ్రూప్‌ దశలోనే టీమిండియా వెనక్కి వచ్చేసింది. ఆ తర్వాత ద్రవిడ్‌ కొత్త కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు.

ఆ పరాభవానికి కారణాలను విశ్లేషించాక ఆటతీరులో మార్పు తెచ్చాడు. సంప్రదాయ ఆటతీరుకు స్వస్తి చెప్పి మూడు ఫార్మాట్లలోనూ దూకుడుగా వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ వారి నుంచి సరైన ఆటతీరును రాబట్టాడు. అద్భుత ప్రదర్శనతో నాలుగు ఐసీసీ టోర్నీల్లో భారత్‌ ఫైనల్స్‌కు చేరగలిగింది. అయితే మూడుసార్లూ తుదిమెట్టుపైనే బోల్తా పడింది. 2022 టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో భారత్‌ ఓడింది. 2023 వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో.. అదే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లోనూ ఆసీస్‌ చేతిలోనే పరాభవం పాలైంది. కానీ నాలుగోసారి ఫైనల్‌కు చేరిన క్రమంలో కోచ్‌గా ద్రవిడ్‌ అనుకున్నది సాధించాడు. అద్భుత విజయాన్ని అందుకున్న రోహిత్ సేన.. వరల్డ్‌కప్‌ను రాహుల్‌ చేతికి అందించి గర్వంగా సెండాఫ్‌ పలికింది.