ఆ ఒక్క గంట టెన్షన్.. టెన్షన్.. చివరికి ప్రాణాలతో బయట పడ్డ నాగార్జున

హీరో నాగార్జునకు కాస్తలో పెను ప్రమాదం తప్పింది. కళ్యాణ్‌ జువెళ్లర్స్‌ ఓపెనింగ్‌కు వెళ్లిన ఆయన అనుకోకుండా వరదల్లో చిక్కుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కొన్ని రోజుల నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - October 22, 2024 / 06:58 PM IST

హీరో నాగార్జునకు కాస్తలో పెను ప్రమాదం తప్పింది. కళ్యాణ్‌ జువెళ్లర్స్‌ ఓపెనింగ్‌కు వెళ్లిన ఆయన అనుకోకుండా వరదల్లో చిక్కుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కొన్ని రోజుల నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రీసెంట్‌గా తుఫాను ప్రభావం తగ్గినట్టు కనిపించినా.. రెండు రోజుల నుంచి మళ్లీ వర్షాలు గట్టిగానే కురుస్తున్నాయి. నిన్న కురిసిన వర్షానికి అనంతపురం, పుట్టపర్తి జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా మంది ఇళ్లలో భారీగా నీళ్లు చేరడంతో రోడ్ల మీదకు వచ్చేశారు. ఇదే సమయంలో నాగార్జున కళ్యాన్‌ జువెల్లర్స్‌ ఓపెనింగ్‌కు అనంతపురంకు బయల్దేయారు. పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌లో దిగిన నాగార్జున.. రోడ్డు మార్గం ద్వారా అనంతపూర్‌ వెళ్లేందుకు రెడీ అయ్యారు. కొంత దూరం కారులో వెళ్లిన తరువాత ఒక్కసారిగా రోడ్డ మీదకు భారీగా వరదనీరు వచ్చింది. దీంతో నాగార్జున ప్రయాణిస్తున్న కారు వరదలో చిక్కుకుపోయింది. నాగార్జునను సురక్షితంగా వరద నుంచి కాపాడేందుకు పోలీసులు చాలా కష్టపడ్డారు. రెస్క్యూ టీం సహాయంతో దాదాపు గంటసేపు కష్టపడి నాగార్జునను సురక్షితంగా రోడ్డు దాటించారు. వెంటనే అక్కడి నుంచి అనంతపూర్‌కు తరలించారు. ఒక్కసారిగా వచ్చిన వరదతో నాగార్జునటీం భయాందోళనకు గురయ్యారు. దాదాపు గంటసేపు రెస్క్యూ ఉత్కంఠగా జరిగింది. ఎట్టకేలకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా అందర్నీ అనంతపూర్‌కు తరలించారు పోలీసులు.