REGNANCY 22ND : 22 నాడే బిడ్డ పుట్టాలని.. ఆపరేషన్లకు ముహూర్తం ఫిక్స్

జనవరి 22వ తేదీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆరోజు తమకు బిడ్డ పుట్టాలని దేశ వ్యాప్తంగా చాలామంది గర్భిణీలు (Pregnant) కోరుకుంటున్నారు. ఈ తేదీ ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఆ రోజు ముహూర్తం పెట్టమని పూజారులను అడుగుతున్నారు. ఆ రోజే సర్జరీ చెయ్యాలని (Operations) డాక్టర్లను సంప్రదిస్తున్నారు.

జనవరి 22వ తేదీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆరోజు తమకు బిడ్డ పుట్టాలని దేశ వ్యాప్తంగా చాలామంది గర్భిణీలు (Pregnant) కోరుకుంటున్నారు. ఈ తేదీ ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఆ రోజు ముహూర్తం పెట్టమని పూజారులను అడుగుతున్నారు. ఆ రోజే సర్జరీ చెయ్యాలని (Operations) డాక్టర్లను సంప్రదిస్తున్నారు.

జనవరి 22.. ఈ రోజు చాలా పవిత్రమైనదనీ.. ఈ రోజు ఏ శుభకార్యం మొదలుపెట్టినా మంచే జరుగుతుందని చాలా మంది నమ్ముతున్నారు. ఇంతకీ జనవరి 22 కి అంత ప్రాధాన్యత ఏంటని చూస్తే.. ఆరోజు మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు అయోధ్య రామ మందిరంలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతోంది (Ayodhya Ram Mandir). అందుకే ఆ రోజు పురుడు పోయమని రిక్వెస్ట్ చేస్తూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు చాలామంది పేరెంట్స్.. ఇదే రోజు కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనేకమంది డిసైడ్ అయ్యినట్టు తెలుస్తోంది. ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న ఈ తేదీన తమ పిల్లలు పుట్టాలని అనేక మంది మహిళలు కోరుకుంటున్నారనీ.. అందుకే ఆ రోజు డెలివరీ చెయ్యమని డాక్టర్లను కోరుతున్నారని చెబుతున్నారు. దాదాపుగా వందేళ్ళ ఎదురు చూపుల తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తైంది. ఈ ఆలయ ప్రారంభం కన్నా శుభదినం ఇంకోటి లేదని అంతా భావిస్తున్నారు. శుభ సమయంలో బిడ్డ పుడితే అది ఆ బిడ్డ వ్యక్తిత్వంపై సానుకూల ప్రభావం చూపిస్తుందని ఆశిస్తున్నారు. అదే నమ్మి.. అనేక మంది ఈరోజున తమ బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నారు.

అందుకోసం గర్భిణీలు.. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ (Private Hospitals) కి క్యూ కట్టినట్టు తెలుస్తోంది. ఈ ముఖ్యమైన రోజున తమ పిల్లలు పుట్టాలని అనేక కుటుంబాలు పట్టుబట్టాయని గైనకాలజిస్టులు చెబుతున్నారు. అయితే అది అంత సేఫ్ కాదనీ.. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు. ఇలా నచ్చిన తేదీల్లో డెలివరీలు చేయడం వల్ల తల్లికి శిశువుకి చాలా నష్టం కలుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా హామీ ఇవ్వడం సాధ్యం కాదనీ, పేరెంట్స్ కి కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నామని చెబుతున్నారు. దేవుడు బిడ్డని భూమిపైకి ఎప్పుడు తీసుకురావాలి అనుకుంటే అప్పుడే తీసుకొవస్తారని డాక్టర్లు చెబుతున్నారు. అందువల్లో ఇలా శుభ దినాలు చూసి పురుడు పోసుకోవాలని ఎక్కడా చెప్పలేదనీ.. సాధారణంగా జరిగే ప్రక్రియని.. మనుషులు టెక్నాలజీ ఉపయోగించి ఇలా చేయడం సరైంది కాదని డాక్టర్లు, పండితులు సూచిస్తున్నారు.