Bangalore Rave Party : పేరు మార్చుకున్న హేమ.. మాములు కథలు కాదుగా..

బెంగళూరు రేవ్ పార్టీ రేపుతున్న రచ్చ.. టాలీవుడ్‌తో పాటు పాలిటిక్స్‌ను షేక్‌ చేస్తోంది. బర్త్ డే పార్టీ పేరుతో వాసు రేవ్ పార్టీ కండక్ట్ చేశాడు. పోలీసులు రైడ్ చేసి.. 103మందిని అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరు రేవ్ పార్టీ రేపుతున్న రచ్చ.. టాలీవుడ్‌తో పాటు పాలిటిక్స్‌ను షేక్‌ చేస్తోంది. బర్త్ డే పార్టీ పేరుతో వాసు రేవ్ పార్టీ కండక్ట్ చేశాడు. పోలీసులు రైడ్ చేసి.. 103మందిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా ఒకెత్తు అయితే నటి హేమ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. పార్టీలో ఆమె ఉన్నట్లు వార్తలు రాగానే.. కవర్ చేసుకునేందుకు హేమ ఓ వీడియో రిలీజ్ చేసింది. మీడియాను, జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత బిర్యానీ వీడియో కూడా చేసింది.

ఐతే హేమ ప్రయత్నాలకు బెంగళూరు పోలీసులు షాక్ ఇచ్చారు. ముందు ఫొటోలు రిలీజ్ చేశారు.. ఆ తర్వాత డ్రగ్ టెస్ట్‌ రిపోర్ట్ బయటపెట్టారు. 103మందికి టెస్ట్ చేస్తే.. 83మందికి పాజిటివ్‌గా వచ్చింది. అందులో హేమ కూడా ఒకరు. ఐతే పేరు మార్చుకుని మరీ హేమ రేవ్ పార్టీకి హాజరయినట్లు తెలుస్తోంది. కృష్ణవేణి అని పేరు మార్చుకుని.. బర్త్ డే పార్టీలో పాల్గొంది హేమ. పోలీసులు రికార్డుల్లో ఆమె పేరు కృష్ణవేణిగా ఉంది. డ్రగ్స్ తీసుకున్న వారిని బాధితురాలిగా చూడటంతోనే.. హేమను కూడా పిలిచి విచారించి.. కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. హేమ అసలు పేరు కృష్ణవేణి. గతంలో చాలాసార్లు ఆమె.. ఈ విషయాన్ని వెల్లడించింది. ఇండస్ట్రీలోకి వచ్చాక హేమగా మారింది.

ఇక బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఒక్కొక్క నిజాలు వెలుగులోకి వచ్చాయి. రేవ్ పార్టీ వ్యవహారంలో.. మీడియా మీద కస్సుమంటోంది హేమ. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సవాళ్లు విసురుతోంది. రేవ్ పార్టీ కేసులో పాజిటివ్‌గా రావడంపై.. మీడియాపై హేమ ఫైర్ అయింది. తాను ఇప్పుడేం మాట్లాడనని.. సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని… అప్పటివరకు ఏం చేసుకుంటారో చేసుకోండని మీడియాపై దురుసుగా మాట్లాడింది.