Russia Batagaika: ప్రపంచంలో అతిపెద్ద బిలం.. కుంగిపోతున్న భూ ఉపరితలం..

భూమిలోపల పొరలు ఉండటం చూసే ఉంటాం. అదే భూమి పై బీటలు కూడా గమనించే ఉంటారు. అవి అప్పుడప్పుడూ బూడిపోతూ తిరిగి ఉద్భవిస్తూ ఉంటాయి. ఇది కాలన్ని బట్టి ప్రకృతితో జరిగే స్పందన. కానీ ఇక్కడ వీటన్నింటికీ భిన్నంగా శాశ్వత బిలం ఏర్పడింది. అది కూడా భూమి పొరల్లో శాశ్వతంగా ఏర్పడింది. ఇంతకు ఈ వింతైన ఘటన ఎక్కడ చోటు చేసుకుందో ఇప్పుడ చూద్దాం.

  • Written By:
  • Publish Date - July 23, 2023 / 07:45 PM IST

రష్యాలోని సైబీరియాలో ఉన్న బటగైకా అనే బిలం రోజు రోజుకూ కాదు క్షణక్షణానికి పెరుగుతూ దాని విస్తృతిని పెంచుకుంటూ పోతుంది. ఇలా పెరుగుతూ పోవడం అక్కడున్న ప్రాంతవాసులతో పాటూ జీవరాశికి తీవ్రముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలా జరగడానికి గల కారణాన్ని కనుగొన్నారు. భూ అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆబిలం చుట్టూ ఉండే కింది భాగంలోని మంచు కరగడం ప్రారంభమైంది. ఇలా కరగిపోయిన ప్రాంతం మొత్తం కుంగిపోతున్నట్లు గుర్తించారు.  ఇలా ప్రకృతి చర్య జరగడం వల్ల మంచు బిలం రోజు రోజుకూ విస్తరిస్తుంది. ఈ బిలానికి మౌత్ టు హెల్, మెగా స్లంప్ అనే శాస్త్రీయ నామం కూడా ఉంది.

ఈ ప్రాంతంలో చిన్న చిన్న గుంతలుగా కనుపిస్తున్నాయి. ఇలా కనిపించిన ప్రదేశంలోపల పొరలు పలుచపడి భూమి కోతకు గురి అవుతుంది. దీని ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాలు, రోడ్లు, ఇళ్లు బీటలు వారుతున్నాయి. ఇక అండర్ గ్రౌండ్లో నీళ్ల కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్లు తుప్పుపట్టి, విరిగిపోపతున్నాయి. దీనిని 63 ఏళ్ల క్రితమే గుర్తించారు. దీని లోతు 282 అడుగుల లోపలికి వెళ్లేందుకు సొరంగ మార్గం ఉన్నట్లు 1960లో కనుగొన్నారు. రష్యాలోని సఖా రిపబ్లిక్ ప్రజలు దీన్ని అండర్ వరల్డ్ గేట్ వే అని పిలుస్తారు. ఇలా జరగడానికి ప్రదాన కారణం నేచుర్ ఇన్ బ్యాలెన్స్ అని చెబుతున్నారు.  ఈ ప్రాంతపు అడవుల్లో చెట్లను ఇష్టానుసారంగా నరికేస్తున్నారు. దీని ప్రభావంతో భూమి కోతకు గురై రష్యాలోని ఉత్తర, ఈశాన్య నగరాలు ప్రమాదంలో పడ్డాయి. అడవులు నరికేయడంవల్ల పచ్చదనం క్రమంగా క్షీణించి ఉష్ణోగ్రతలు పెరిగి బిలం పెరిగేందుకు దోహదపడుతున్నట్లు శాస్త్రవేత్తలు పలుసార్లు సూచించారు. అయినప్పటికీ ఇక్కడి చెట్లును నరకడం మానటంలేదు గ్రామస్తులు.

దీనిపై ఎరెల్ స్ట్రుచ్ కోవ్ అనే స్థానికుడు స్పందించారు. ఈ ప్రాంతం ఒకప్పుడు లోయగా ఉండేది. ఇక్కడి ప్రాంత వేడికి భూమి కుంగిపోయి పెద్ద రంధ్రంలా మారింది. భవిష్యత్తులో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉండవచ్చు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే రష్యాలో 2.5 రెట్లు వేగంగా ఇక్కడి భూమి వేడెక్కుతుంది.  ఇలా జరగడమే ఈ బిలం పెరిగేందుకు ముఖ్యకారణంగా నికితా తననాయేవ్ అనే శాస్త్రవేత్త వివరించారు.

T.V.SRIKAR