Robot : ఇండియాలో పెరగనున్న రోబోట్ల వినియోగం..

భారత్‌లో ముఖ్యంగా తయారీ రంగంలో రోజు రోజుకూ రోబోట్ల వినియోగం పెరుగుతోంది. పనిలో ఖచ్చితత్వం కోసం ఎక్కువగా రోబోట్లను వినియోగిస్తున్నారు. గత పదేళ్లలో రోబోట్ల వినియోసం రెండింతలైంది.

వ్యవసాయం, ఆరోగ్యం, తయారీ, భద్రత.. ఈ నాలుగు రంగాల్లో రోబోట్ల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2030 నాటికి భారత్‌ను రోబోటిక్స్‌కు అంతర్జాతీయ హబ్‌గా మార్చేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. రోబోటిక్స్‌ అనుబంధ రంగాళ్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రోబోటిక్స్‌ రంగంలో ఉన్న సంస్థలు, యువ ఒత్సాహిక వేత్తలకు మరింత ప్రోత్సాహం అందించే విధంగా ప్లాన్‌ చేస్తోంది. ఇందుకోసం జాతీయ వ్యూహాత్మక ముసాయిదా విధానాన్ని రూపొందించింది. ఈ ముసాయిదా విధానంపై విద్యా సంస్థలు, ఐటీ నిపుణులు, పరిశ్రమలు, విద్యార్థులు, ప్రజల నుంచి త్వరలోనే అభిప్రాయ సేకరణ చేపట్టబోతోంది.

ఇక పై భారత్ లోనే రోబోల తయారీ..

భారత్‌లో ముఖ్యంగా తయారీ రంగంలో రోజు రోజుకూ రోబోట్ల వినియోగం పెరుగుతోంది. పనిలో ఖచ్చితత్వం కోసం ఎక్కువగా రోబోట్లను వినియోగిస్తున్నారు. గత పదేళ్లలో రోబోట్ల వినియోసం రెండింతలైంది.అయితే ఈ రోబోట్ల విడిభాగాలను విదేశాల నుంచి ఇంపోర్ట్‌ చేసుకుంటోంది భారత్‌. ఇప్పటి నుంచి వాటిని కూడా ఇక్కడే తయారు చేసేలా కొత్త ప్రణాళిక రెడీ అవుతోంది. రోబోటిక్స్‌ వ్యవస్థ అభివృద్ధి, నిర్వహణ కోసం ఇక్కడి వ్యక్తులకు ట్రైనింగ్‌ అవసరం ఈ దిశగా త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, డీప్‌ లెర్నింగ్‌, మెషీన్‌ లెర్నింగ్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీలను సమన్వయం చేసి భారత్‌లో రోబోలను తయారు చేయబోతున్నారు. వివిధ రంగాల్లో ఇవి సేవలు అందించడంతో పాటు ఖచ్చితత్వంతో పని చేస్తాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో రోబోల సేవలు కీలకంగా మారబోతున్నాయి.