ఆలయాల్లో జరిగే రథోత్సవంలో భక్తులంతా పాల్గొంటారు. ఆడ, మగ, పిల్లలు, పెద్దలు.. అందరూ కలిసి రథాన్ని లాగుతారు. కానీ.. ఆ ఒక్క ఆలయంలో…. మహిళలు మాత్రమే రథాన్ని లాగుతారు. ఎందుకలా…? ఎక్కడుంది ఆలయం..?
మధుర మీనాక్షి ఆలయం… తమిళనాడులోని మధురైలో ఉంది. ఆ ఆలయంలో… అష్టమి చప్పరం రథోత్సవం కన్నులపండువగా జరిగింది. అష్టమి చప్పరం అనేది తమిళ క్యాలెండర్‌లోని మార్గశిర మాసంలో అష్టమి నెలవంక తగ్గుతున్న సమయంలో జరుపుకునే ఒక వేడుక. మదుర మీనాక్షి దేవి, సుందరేశ్వర స్వామిని విడివిడిగా చప్పరం మీద అంటే రథం మీద ఉంచి.. ఊరంతా ఊరేగింపు చేస్తారు. ఆ రథాన్ని స్త్రీలు మాత్రమే లాగుతారు. అది.. ఆ ఆలయ ఆచారం అని అంటున్నారు పండితులు.
మార్గశిర అష్టమిని పురస్కరించుకుని మధురైలో అంగరంగ వైభవంగా మీనాక్షి అమ్మవారి రథోత్సవం జరిగింది. వేల సంఖ్యలో భక్తులు.. ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా… డప్పు వాయిద్యాలతో మార్మోగింంది. ముందుగా.. మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వరుల విగ్రహాలను అందంగా అలంకరించారు. ఆ తర్వాత.. ఉత్సవమూర్తులను రథంపై ఉంచారు. మహిళలు రథం లాగుతుండగా… ఊరంతా ఊరేగింపు సాగింది. ఈ రథోత్సవంలో పాల్గొన్న భక్తులు… భక్తిశ్రద్ధలతో అమ్మవారిని స్మరించుకున్నారు.
రథోత్సవం జరుగుతుండగా… శివాచార్యులు పడి నుంచి బియ్యం గింజలను భక్తులపై కురిపిస్తారు. అలా.. శివాచార్యులు వీధుల్లో పోసిన బియ్యపు గింజలను భక్తులు ఇళ్లకు తీసుకెళ్లారు. వాటిని ఇంట్లో ఉంచి పూజించిన తర్వాత… ప్రసాదంగా చేసుకుని తింటే.. రుచిగా ఉంటుందని, దీర్ఘకాలిక రోగాలు దూరమవుతాయని నమ్ముతారు. అంతేకాదు.. భక్తులకు అష్ట ఐశ్వరాలు, సుఖసంతోషాలు కలుగుతాయని కూడా విశ్వసిస్తారు.
మార్గశిర మాసంలో జరుపుకునే… ఈ అష్టమి చప్పరం పండుగకు… ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివుడు, శక్తి, విష్ణువుకు ప్రతీకగా.. ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. భక్తులు.. ఉపవాసం ఉండి… భక్తిశ్రద్ధలతో మీనాక్షి అమ్మవారిని, స్వామివారిని స్మరించుకుంటూ… రథోత్సవంలో పాల్గొంటారు భక్తులు. మాడవీధుల్లో నిలబడి స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకుంటారు. మీనాక్షి అమ్మవారి ఆలయం నుంచి గీజామాసి రోడ్డు, యానికల్‌తోపాటు నాలుగు మాఢ వీధుల గుండా సాగిన రథోత్సవం… తిరిగి ఆలయానికి చేరుకుంది.