Telangana Election 2023: నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రధాన ఎన్నికల అధికారి. నోటిఫికేషన్ నుంచి నామినేషన్ వరకూ.. పోలిం నుంచి ఫలితాాల వరకూ అన్ని వివరాలను వెల్లడించింది.

  • Written By:
  • Updated On - October 9, 2023 / 01:14 PM IST

తెలంగాణతో పాటూ మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వివరాలను ప్రకటించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఏడాదితో గడువు ముగియనున్న సంగతి తెలిసిందే. 40 రోజులపాటూ 5 రాష్ట్రాల్లో పర్యటించి క్షుణ్ణంగా పరిస్థితులను అధ్యయనం చేసినట్లు తెలిపారు సీఈసీ రాజీవ్ కుమార్. అలాగే ఐదు రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులు, పార్టీల కీలక నేతలతో పలు సార్లు చర్చలు సమావేశాలు జరిపినట్లు వివరించారు. ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు గానూ గడిచిన ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే వివిధ రాజకీయ పార్టీల నుంచి కొన్ని అభిప్రాయాలను స్వీకరించామన్నారు.

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వివరాలు..

  • రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్
  • నోటిఫికేషన్ విడుదల – నవంబర్ 3
  • నామినేషన్ల దాఖలు చివరి తేది – నవంబర్ 10
  • నామినేషన్ల పరిశీలన – నవంబర్ 13
  • నామినేషన్ల ఉపసంహరణ చివరి తేది – నవంబర్ 15
  • ఎన్నికలు నిర్వహించే తేది – నవంబర్ 30
  • కౌంటింగ్ / ఎన్నికల ఫలితాలు ప్రకటన తేది – డిశంబర్ 03

తెలంగాణలో పోలింగ్ కేంద్రాల వివరాలు ఇలా..

  • తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,17,17,389
  • మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు 8లక్షల 11 వేల మంది
  • తెలంగాణలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 35వేల 356
  • అందులో 27వేల 798 కేంద్రాలు వెబ్ క్యాస్టింగ్ లో ఉంటాయి
  • ఎలక్షన్ కోసం 72 వేల బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉంచారు
  • ఎన్నికల కోసం 57 వేల కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు
  • రాష్ట్ర వ్యాప్తంగా 56 వేల వీవీ ప్యాట్ యంత్రాలు సిద్దం చేశారుక
  • తెలంగాణ వ్యాప్తంగా 80 ఏళ్లు పైబడిన వృద్ద ఓటర్ల సంఖ్య 4లక్షల 43 వేలు
  • 80 ఏళ్లు దాటిన వారికి ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం కల్పించిన సీఈసీ

T.V.SRIKAR